Yearly Sunsign Horoscope

01st January, 2020 to 31st December, 2020

Aquarius

కుంభం(23rd January- 22nd February)

చేపట్టిన ప్రతి కార్యక్రమం పూర్తి చేసేవరకూ విశ్రమించరు.

అందరి మనస్సులను ఆకట్టుకుని ముందుకు సాగుతారు.

ఆత్మీయులు మీకు పూర్తి సహకారం అందిస్తారు.

స్థిరాస్తులు క్రయవిక్రయాలు మరింత లాభిస్తాయి.

ఆదాయానికి ఇబ్బంది లేకున్నా ఏదో ఒక ఖర్చు మాత్రం ఎదురవుతునే ఉంటుంది.

ఆత్మస్థైర్యం తో ముందుకు సాగి కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు.

కుటుంబంలో బాధ్యతాయుతంగా వ్యవహరించి అందరి ప్రశంసలు పొందుతారు.

విద్యార్థులు ఫలితాల పై ఊరట చెందుతారు. విదేశీ విద్యావకాశాలు సైతం దక్కుతాయి.

కొత్త ఉద్యోగాలు సైతం లభించే వీలుంది. అయితే దూరప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది.

వివాహాది శుభకార్యాలు విస్తృతంగా చేపడతారు. ఇందుకు డబ్బు వెచ్చిస్తారు.

కాంట్రాక్టర్లకు చేజారిన అవకాశాలు సైతం తిరిగి దక్కే ఛాన్స్‌.

వ్యాపారులు పెట్టుబడులకు తగినంతగా లాభాలు అందుకుంటారు. భాగస్వాములు కూడా మీ నిర్ణయాలకు ఎదురుచెప్పరు. విస్తరణ కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేస్తారు.

ఉద్యోగులకు ఒత్తిడులు కాస్త తొలగుతాయి. ఉన్నత హోదాలు, ఇంక్రిమెంట్లు దక్కే అవకాశం. అలాగే, ఊహించని బదిలీలు ఉండవచ్చు.

రాజకీయ, పారిశ్రామికవేత్తలకు ఆశలు ఫలిస్తాయి. కొందరికి పదవీయోగం.

కళాకారులు మరిన్ని అవకాశాలు దక్కించుకుని ఉక్కిరిబిక్కిరి కాగలరు. ద్వితీయార్థంలో అవార్డులు లేదా పురస్కారాలు పొందే వీలుంది.

వ్యవసాయదారులు, సాంకేతిక నిపుణులు, క్రీడాకారులకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. అయితే మధ్యమధ్యలో కొన్ని అవాంతరాలు తప్పవు.

మహిళలు స్వశక్తి పై ముందుకు సాగి విజయాలు సాధిస్తారు.

మే, సెప్టెంబర్, జనవరి నెలలు ఆరోగ్యపరంగా చికాకులు ఎదురుకావచ్చు.

ఇక ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్, అక్టోబర్, డిసెంబర్‌నెలలు విశేష యోగదాయకమైనవి.

అదృష్ట సంఖ్యలు...3,6,8.

అదృష్ట రంగులు...నలుపు, నేరేడు.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces