పంచాంగం...ఆదివారం, 19.11.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంతఋతువు మార్గశిర మాసం తిథి శు.పాడ్యమి సా.5.24 వరకు తదుపరి విదియ నక్షత్రం అనూరాధ రా.9.08 వరకు తదుపరి జ్యేష్ఠ వర్జ్యం తె.3.01 నుంచి 5.01 వరకు దుర్ముహూర్తం సా.3.51 నుంచి 4.36 వరకు రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు యమగండం ప.12.00 నుంచి 1.30 వరకు శుభ సమయాలు...ప.2.11 నుంచి 3.44 వరకు ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాలు, ప్రయాణాలు.

Yearly Sunsign Horoscope

01st January, 2017 to 31st December, 2017

Aries

మేషం...(మార్చి 21–ఏప్రిల్‌20)

ఈ రాశి వారికి జనవరి చివరి నుంచి సమస్యల నుంచి విముక్తి. ఈతి బాధలు తొలగే సూచనలు. కష్టసుఖాలు సమాన స్థాయిలో  స్వీకరించే గుణం అలవడుతుంది. దైవారాధనలో నిమగ్నమవుతారు. మిత్రులు, బంధువులతో వివాదాలు చాలా వరకూ సర్దుబాటు కాగలవు. ఇక ఆదాయం కొంత ఇబ్బంది కలిగించినా ద్వితీయార్థం నుంచి పుంజుకుంటుంది. మార్చి నుంచి  ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. అయితే ఈ ఏడాది మీకు అనుకూలమైన సంఖ్య కావడం అదృష్టం. దీనివల్ల అన్నింటా విజయాలు సాధిస్తారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. అవివాహితులకు వివాహ యోగం. కొత్త వ్యాపారాలు, ప్రాజెక్టులు చేపడతారు. విద్యార్థులకు ఆశించిన విద్యావకాశాలు లభిస్తాయి. అలాగే అనుకూల ఫలితాలు సాధిస్తారు. వ్యాపారులకు గతం కంటే మెరుగైన లాభాలు.ఉద్యోగులకు పదోన్నతులతో కూడిన బదిలీలు ఉంటాయి. నిరుద్యోగులకు శుభ వర్తమానాలు. వ్యవసాయదారులకు పెట్టుబడులు సమకూరతాయి.  తరచూ ప్రయాణాలు, తీర్థ యాత్రలు చేస్తారు. కొందరికి విదేశీ పర్యటన అవకాశాలుంటాయి. కళాకారులకు అవార్డులు. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. జులై, డిసెంబర్‌ నెలలు కొంత అప్రమత్తంగా మెలగండి. కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలుంటాయి.

అదృష్ట సంఖ్య 9, సుబ్రహ్మణ్యారాధన మంచిది.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces