Yearly Sunsign Horoscope
01st January, 2019 to 31st December, 2020
Aries
మేషం (21 మార్చ్ - 20 ఏప్రిల్)
తరచూ ప్రయాణాలు, తీర్థ యాత్రలతో గడుపుతారు.
వ్యూహాత్మక వైఖరితో ముందుకు సాగి ఊహించని విజయాలు సొంతం చేసుకుంటారు.
ఏ పని చేపట్టినా పూర్తి చేసే వరకూ విశ్రమించరు.
నిర్ణయాలపై తొందరపాటు వద్దు.
సోదరులు,మిత్రులతో వివాదాలు నెలకొన్నా ఎప్పటికప్పుడు సర్దుబాటు చేసుకుంటారు. సమస్యల పరిష్కారంలో మీ అంతట మీరే చొరవ తీసుకుంటారు.
భార్యాభర్తల మధ్య ఎంతో కాలంగా నెలకొన్న వివాదాలు ఎట్టకేలకు పరిష్కారమవుతాయి.
కొన్ని కేసులు ఉపసంహరించుకుంటారు.
ఆర్థికంగా బలం చేకూరినా,అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది.
శారీరక రుగ్మతలు బాధిస్తాయి.
వ్యాపారాలలో లాభనష్టాలను సమానంగా భరించాల్సి ఉంటుంది. పెట్టుబడులు, విస్తరణలో కొంత జాప్యం జరిగినా పూర్తి చేస్తారు.
ఉద్యోగాలలో అనుకూల మార్పులు, విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి.
పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రాజకీయవేత్తలకు పట్టింది బంగారమే.
వ్యవసాయదారులకు రెండవ పంట లాభిస్తుంది.
విద్యార్థులు, నిరుద్యోగులు లక్ష్యాలు సాధిస్తారు.
మహిళలకు ఎన్నడూ లేని విధంగా మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
మార్చి,జూలై, అక్టోబర్, నవంబర్ నెలలు చికాకులు, బంధువిరోధాలు. శారీరక రుగ్మతలు, ఆస్పత్రుల సందర్శనం.
అదృష్ట సంఖ్య–9,
అదృష్ట రంగులు-ఎరుపు, నేరేడు, బంగారు
నిత్యం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ని పూజించడం మంచిది