Yearly Sunsign Horoscope

01st January, 2020 to 31st December, 2020

Aries

మేషం (21st March – 20th April)

వీరికి గతం నుంచి ఎదురవుతున్న అడ్డంకులు తొలగి ఊరట లభిస్తుంది.

అప్రయత్నంగానే కొన్ని కార్యక్రమాలు పూర్తి కాగల అవకాశం.

ఆప్తులు, శ్రేయోభిలాషులు మీ ప్రగతిలో భాగస్వాములవుతారు.

స్వశక్తితోనే ఆశయాలు, లక్ష్యాలు సాధించేందుకు సిద్ధమవుతారు.

వివాహాది వేడుకల నిర్వహణలో మరింత బిజీగా గడుపుతారు.

మీ సేవలకు తగినంత గుర్తింపు లభిస్తుంది.

జీవితాన్ని మలుపు తిప్పే ఒక సంఘటన ఎదురవుతుంది.

సోదరులు, సోదరీలతో దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న వివాదాలు తీరతాయి.

బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి.

నూతన విద్యావకాశాలు ముఖ్యంగా విదేశీ విద్యావకాశాలతో విద్యార్థులు ఉత్సాహంగా గడుపుతారు.

సామాజిక సేవా కార్యక్రమాలు విరివిగా చేపడతారు.

మధ్యమధ్యలో ఆరోగ్య, కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు.

ఉద్యోగార్ధులకు ఉద్యోగ యోగం.

కాంట్రాక్టర్లు ఊహించని విధంగా టెండర్లు దక్కించుకుంటారు.

ఆదాయ వనరులు పెరిగి డబ్బుకు కొదవ లేకుండా గడుపుతారు.

వ్యాపారస్తులు సంస్థల వికేంద్రీకరణలో విజయం సాధిస్తారు. నూతన పెట్టుబడులకు సిద్ధపడతారు.

ఉద్యోగస్తులు కార్యదీక్షాపరులై బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

పారిశ్రామికవేత్తలకు ఊహించని విధంగా కంపెనీల విస్తరణ కార్యక్రమాలు పూర్తి కాగలవు.

కళాకారులు గతం కంటే మరిన్ని అవకాశాలు సాధిస్తారు. కొందరికి అవార్డులు సైతం దక్కుతాయి.

రాజకీయవేత్తలకు ఊహించని పదవులు దక్కుతాయి. ప్రజాక్షేత్రంలో మీదే విజయం.

వ్యవసాయదారులు, సాంకేతిక నిపుణులకు మరింత అనుకూల పరిస్థితులు.

మహిళలకు అత్యంత లాభదాయకంగా ఉంటుంది.

మార్చి, జూలై, సెప్టెంబర్, నవంబర్‌నెలలు ముఖ్యంగా ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సిన సమయం. అకాల ఆహారవిహారాదులకు స్వస్తి చెప్పడం మంచిది.

షేర్ల క్రయవిక్రయాలు జరిపే వారికి మిశ్రమంగా ఉంటుంది.

ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్, ఆగస్టు, డిసెంబర్‌నెలలు విశేషమైనవి. మిగతావి సామాన్యంగా ఉంటాయి.

అదృష్ట సంఖ్యలు..1,9,5.

అదృష్ట రంగులు....ఎరుపు, ఆరెంజ్‌.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces