పంచాంగం...ఆదివారం, 19.11.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంతఋతువు మార్గశిర మాసం తిథి శు.పాడ్యమి సా.5.24 వరకు తదుపరి విదియ నక్షత్రం అనూరాధ రా.9.08 వరకు తదుపరి జ్యేష్ఠ వర్జ్యం తె.3.01 నుంచి 5.01 వరకు దుర్ముహూర్తం సా.3.51 నుంచి 4.36 వరకు రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు యమగండం ప.12.00 నుంచి 1.30 వరకు శుభ సమయాలు...ప.2.11 నుంచి 3.44 వరకు ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాలు, ప్రయాణాలు.

Yearly Sunsign Horoscope

01st January, 2017 to 31st December, 2017

Cancer

 కర్కాటకం....(జూన్‌23–జూలై 22)

వీరికి అదృష్టం తలుపు తట్టినట్లే అనిపించినా అంత ఆశాజనకంగా ఉండదు. సాధించాలనుకున్న కార్యాలు నెమ్మదిగా సాగుతాయి. పలుకుబడి, పరపతి పెంచుకుంటారు. వివాదాల నుంచి బయటపడేందుకు మరింత శ్రమించాల్సి ఉంటుంది. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా మారతాయి. ధైర్యం,సాహసాలతో ముందడుగు వేయండి. సెప్టెంబర్‌ నెల నుంచి అనుకూల  పరిస్థితులు నెలకొంటాయి. విద్యార్ధులకు శ్రమానంతరం మంచి ఫలితాలు దక్కుతాయి. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు అందడంతోపాటు ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగులకు ప్రధమార్ధంలో బదిలీలు. ద్వితీయార్ధంలో పదోన్నతులు. పారిశ్రామికవేత్తలకు గతం కంటే మెరుగుదల ఉంటుంది. నాయకులకు ఒడిదుడుకులు తొలగుతాయి. కళాకారులు కొత్త అవకాశాలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు.

వ్యవసాయదారులకు పంటలు ఆశాజనకంగా ఉంటాయి.

జులై, డిసెంబర్‌ నెలలు ఆరోగ్య విషయంలో కొంత మెలకువ అవసరం.

అదృష్ట సంఖ్య 2. శివాలయంలో అభిషేకాలు చేయించుకోవడం  మంచిది.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces