Yearly Sunsign Horoscope
01st January, 2019 to 31st December, 2020
Cancer
కర్కాటకం (23 జూన్ - 22 జులై)
సామాజిక కార్యక్రమాల పై మరింత దృష్టి సారిస్తారు.
కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది.
విచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు.
మీ ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు.
కాంట్రాక్టులు దక్కి ఉత్సాహంగా గడుపుతారు.
ముఖ్యమైన కార్యక్రమాలలో పురోగతి సాధిస్తారు.
ఇంటి నిర్మాణాలు చేపడతారు.
పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
మీ శక్తియుక్తులు, మేథస్సుతో ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు.
వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు.
ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి, అయితే అవసరాల రీత్యా అప్పులు కూడా చేస్తారు.
మీ పై నెపం మోపి దోషులుగా చిత్రీకరించేందుకు కొందరు యత్నిస్తారు, అయితే మీరు అప్రమత్తంగా మెలగడం ఉత్తమం.
ఆరోగ్యం పై మరింత శ్రద్ధ వహించండి.
వ్యాపారాలలో కొంత మేరకు లాభాలు అందుతాయి. పెట్టుబడులు సమకూర్చుకునేందుకు చేసే యత్నాలు సానుకూలమవుతాయి.
ఉద్యోగాలలో అనుకున్న మార్పులు ఉండవచ్చు. పై స్థాయి వారి నుంచి ఒత్తిడులు అధిగమిస్తారు.
పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.
వ్యవసాయదారులు రెండవపంట అనుకూలించి ఉపశమనం పొందుతారు.
మహిళలకు ఎంతోకాలంగా ఎదురవుతున్న సమస్యలు తీరతాయి.
జనవరి, ఫిబ్రవరి, జూన్, ఆగస్టు, అక్టోబర్ నెలల్లో మరింత అప్రమత్తత అవసరం. ప్రతి వ్యవహారంలోనూ, ఆరోగ్యపరంగా చికాకులు.
అదృష్ట సంఖ్య–2
పసుపు, నేరేడు, బిస్కట్ రంగులు అనుకూలం.
నిత్యం లక్ష్మీ అమ్మవారిని పూజించడం మంచిది