Yearly Sunsign Horoscope

01st January, 2020 to 31st December, 2020

Cancer

కర్కాటకం(23rd June- 22nd July)

కొన్ని కార్యక్రమాలను చేపట్టిన వెనువెంటనే పూర్తి చేసి సమర్థత చాటుకుంటారు.

ఇంత కాలం ఎదురైన కొన్ని ఇబ్బందులు మీ అంతట మీరే పరిష్కరించుకుంటారు.

చర,స్థిరాస్తుల విషయంలో స్దబ్ధత తొలగుతుంది.

సోదరులు, సోదరీలతో స్వల్ప వివాదాలు నెలకొన్నప్పటికీ బయటపడతారు.

ఇళ్లు కొనుగోలులో ప్రతిష్ఠంభన తొలగి స్వగృహ ప్రాప్తి కలుగుతుంది.

మీ చొరవతో శత్రువులను కూడా ఆకట్టుకుంటారు.

వివాహ ప్రయత్నాలు ఫలించి ఉత్సాహంగా గడుపుతారు.

స్నేహితులతో ఒక కీలక వ్యక్తి మీకు ఇతోధికసాయం అందిస్తారు.

విద్యార్థులు, నిరుద్యోగులు లక్ష్యాలు సాధించే దిశగా అడుగులు వేస్తారు.

కాంట్రాక్టర్లకు ఆశించినరీతిలో టెండర్లు దక్కుతాయి.

ఆదాయ మార్గాలు మెరుగుపడి ఆశించినంతగా సొమ్ము అందుకుంటారు.

వ్యాపార, వాణిజ్యవర్గాలు గతం కంటే మరింత మెరుగుపడి లాభాలు ఆర్జిస్తారు. కొత్త భాగస్వాములను సైతం ఆకట్టుకుంటారు. విదేశీ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటారు.

ఉద్యోగస్తులకు విధులలో గందరగోళం తొలగి ఊరట లభిస్తుంది. అయితే కొందరికి ఆకస్మిక బదిలీలు జరుగవచ్చు.

పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు ఈ ఏడాది ఊహించని అవార్డులు, రివార్డులు లభిస్తాయి.

వ్యవసాయదారులు, టెక్నాలజీ రంగ నిపుణులకు ద్వితీయార్ధం శుభదాయకమైన కాలమని చెప్పాలి.

మహిళలకు కుటుంబ సభ్యులు మరింత సహకరిస్తారు.

ఫిబ్రవరి, జూన్, అక్టోబర్‌నెలలు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురయ్యే వీలుంది. ఆహారవిహారాదుల పై పరిమితులు తప్పని సరి.

మార్చి, మే, జూలై, సెప్టెంబర్, నవంబర్‌విశేషంగా కలిసివచ్చే నెలలు.

అదృష్ట సంఖ్యలు...1,2,9.

అదృష్ట రంగులు...ఎరుపు, గులాబీ.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces