పంచాంగం...ఆదివారం, 19.11.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంతఋతువు మార్గశిర మాసం తిథి శు.పాడ్యమి సా.5.24 వరకు తదుపరి విదియ నక్షత్రం అనూరాధ రా.9.08 వరకు తదుపరి జ్యేష్ఠ వర్జ్యం తె.3.01 నుంచి 5.01 వరకు దుర్ముహూర్తం సా.3.51 నుంచి 4.36 వరకు రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు యమగండం ప.12.00 నుంచి 1.30 వరకు శుభ సమయాలు...ప.2.11 నుంచి 3.44 వరకు ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాలు, ప్రయాణాలు.

Yearly Sunsign Horoscope

01st January, 2017 to 31st December, 2017

Capricorn

మకరం...(డిసెంబర్‌22–జనవరి 20)

వీరికి మార్చి తరువాత అన్నీ శుభాలే. ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం దక్కుతుంది.  కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలసి వస్తాయి. కొన్ని సమస్యలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. విద్యార్థులు అనుకూల ఫలితాలు సాధిస్తారు. వ్యాపారస్తులకు లాభాలు ఊరటనిస్తాయి. పెట్టుబడులకు ఢోకాలేదు. ఉద్యోగులకు శ్రమ పడ్డా ఫలితం ఉంటుంది. పదోన్నతులు ఖాయం. పారిశ్రామికవర్గాలకు కొత్త సంస్థలలో వాటాలు దక్కవచ్చు. కళాకారులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. నాయకులకు పదవీయోగం. వ్యవసాయదారుల కృషి ఫలిస్తుంది.

అదృష్ట సంఖ్య 8. వీరు అమ్మవారికి తరచూ కుంకుమార్చనలు చేయడం మంచిది.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces