Yearly Sunsign Horoscope

01st January, 2020 to 31st December, 2020

Capricorn

మకరం(23rd December – 22nd January)

కొంత కష్టసాధ్యమైనా అనుకున్న పనులు పూర్తి చేస్తుంటారు.

ఆత్మీయులు, బంధువులతో తరచూ విభేదిస్తుంటారు. వారు కూడా మీ పట్ల కొంత వ్యతిరేకత చూపుతుంటారు.

ఆదాయానికి, వ్యయానికి పొంతన ఉండదు. కొత్తగా రుణాలు చేయాల్సివస్తుంది.

కాంట్రాక్టర్ల శ్రమ వృథాగా మిగులుతుంది.

ప్రతి విషయంలోనూ తొందరపాటు కాకుండా నిదానం పాటించడం ఉత్తమం.

సమస్యలు కొన్నింటిని అత్యంత చాకచక్యంగా పరిష్కరించుకుంటారు.

స్థిరాస్తులకు సంబంధించి తండ్రి తరఫు వారు ఒత్తిడులు పెంచుతారు. అయితే ద్వితీయార్థంలో కొలిక్కి వచ్చే సూచనలు.

కుటుంబంలో శుభకార్యాల నిర్వహణలో ప్రధాన భాగస్వాములవుతారు.

మీ అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించడంతో ఆప్తులు దూరమయ్యే అవకాశం.

ఇళ్ల నిర్మాణాలలో అవాంతరాలు కొంత తొలగుతాయి. మొత్తం మీద ఈ ఏడాది వీటిని పూర్తి చేస్తారు.

వాహనాలు నడిపే వారు కొంత జాగ్రత్తగా వ్యవహరించడం ఉత్తమం.

విద్యార్థులు కొంత అనుకూల ఫలితాలు సాధిస్తారు.

వ్యాపారస్తులు లాభనష్టాలు సమానంగా పొందుతారు. విస్తరణ కార్యక్రమాలు కొంత నెమ్మదిస్తాయి.

ఉద్యోగులు అదనపు బాధ్యతలు మీదవేసుకుంటారు. బలవంతంగా బదిలీలకు సిద్ధపడాలి.

పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు.

రాజకీయవేత్తలకు ద్వితీయార్థం మెరుగైన ఫలితాలు ఉంటాయి.

కళాకారులకు అవకాశాలు కొన్ని ఊరటనిస్తాయి. అయితే కొన్ని అపవాదులు భరించాల్సి వస్తుంది.

వ్యవసాయదారులు, టెక్నాలజీ రంగ నిపుణులు, న్యాయవాదులు లక్ష్య సాధనలో విజయం సాధిస్తారు.

మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరడమే కాకుండా మరింత గౌరవమర్యాదలు పొందుతారు.

ఏప్రిల్, ఆగస్టు, డిసెంబర్‌నెలలు ఆరోగ్య విషయంలో మెలకువగా ఉండాల్సినవి. ఆహారవిహారాదుల పై పరిమితులు మంచిది.

ఇక జనవరి, మార్చి, మే, సెప్టెంబర్, నవంబర్‌నెలలకు అత్యంత యోగదాయకమైనవి.

అదృష్ట సంఖ్య...3,6,8.

అదృష్ట రంగులు...నీలం, ఆకుపచ్చ.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces