Yearly Sunsign Horoscope
01st January, 2018 to 31st December, 2018
Gemini
మిథునం..(మే 22–జూన్22)
వీరు గతం కంటే మెరుగైన ఫలితాలు పొందే అవకాశం. పనులు చకచకా పూర్తి చేసి ముందడుగు వేస్తారు. బంధువులు, స్నేహితులతో కొద్దిపాటి విభేదాలు నెలకొన్నా సర్దుబాటు చేసుకుంటారు. ఇతరులకు చేతనైన సహాయం అందిస్తారు. భార్యాభర్తలు, సోదరీ,సోదరులతో ఉత్సాహంగా గడుపుతారు. కాంట్రాక్టర్లు, రియల్ఎస్టేట్ల వారికి అభివృద్ధి కనిపిస్తుంది. ఆశించిన రాబడి దక్కి ఉల్లాసంగా గడుపుతారు. వివాహాది శుభకార్యాల నిర్వహణలో బిజీగా గడుపుతారు. ప్రముఖులు మీకు చేయూతనందిస్తారు. విద్యార్థులు కోరుకున్న ర్యాంకులు సాధిస్తారు. ఆరోగ్యమే మహాభాగ్యమన్న సూక్తిని అనుసరించి ఆహారవిహారాదులలో తగు జాగ్రత్తలు పాటించడం మంచిది. ప్రత్యర్థులతో ఎటువంటి పరిస్థితుల్లోనూ రాజీ పడబోరు. తీర్థయాత్రలు చేస్తారు. కుటుంబంలో శుభపరిణామాలు. వ్యాపారాలు, వాణిజ్యవర్గాలకు లాభాలు. ఉద్యోగులకు పదోన్నతులు, తద్వారా బదిలీలు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలు, వ్యవసాయదారులకు పట్టింది బంగారమే. కళాకారులు, రాజకీయవేత్తలకు సత్కారాలు జరుగుతాయి. మహిళలకు విజయాలు వరిస్తాయి.
జనవరి, జూలై, సెప్టెంబర్, డిసెంబర్నెలలు కొంత చికాకు పరుస్తాయి. చోరభయం. మానసిక అశాంతి. ఇంటాబయటా కలహాలు వంటి ఫలితాలు కనిపిస్తాయి.
అదృష్ట సంఖ్య.––5,
నిరంతరం విష్ణుసహస్రనామ పారాయణ చేయడం మంచిది.