Yearly Sunsign Horoscope

01st January, 2019 to 31st December, 2020

Gemini


మిథునం ( 22 మే - 22 జూన్) 

చేపట్టిన కార్యాలు మధ్యమధ్యలో పెండింగ్‌లో పడినా ఎట్టకేలకు పూర్తవుతాయి.

మీ సహనాన్ని పరీక్షించేందుకు స్నేహితులు యత్నించి విఫలమవుతారు.

పట్టుదల, నేర్పు, దృఢ చిత్తంతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు.

అయితే, ఆరోగ్యం, వాహనాల విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

నిత్యం శ్రీ వెంకటేశ్వరస్వామి ని పూజించడం మంచిది

బంధువులు, అత్యంత ఆప్తులతో తరచూ విభేదాలు నెలకొన్నా మీరే మెట్టుదిగి సర్దిచెబుతారు.

విద్యార్థులు, నిరుద్యోగుల ఆశలు అంతగా ఫలించవు, అయితే ఏడాది చివరిలో కొంత అనుకూలత ఉంటుంది.

ఆస్తుల విషయంలో చేసుకున్న అగ్రిమెంట్లు రద్దు చేసుకుంటారు.

ఆర్థికంగా కొంత వెసులుబాటు కలుగుతుంది. రుణదాతల ఒత్తిడులు చాలావరకు  తొలగుతాయి.

తరచూ తీర్థయాత్రలు, ప్రయాణాలు చేస్తారు.

పలుకుబడి కలిగిన వారు పరిచయమవుతారు.

సేవాకార్యక్రమాల పై దృష్టి సారిస్తారు.

వ్యాపారస్తులు అనుభవాలతో సమస్యల నుంచి బయటపడతారు. అధికారుల తీరు కొంత మనస్తాపం కలిగిస్తుంది.

ఉద్యోగస్తులు శ్రమ పెరిగినా తట్టుకుని తగిన గుర్తింపు పొందుతారు.

పారిశ్రామిక, రాజకీయవేత్తలు, కళాకారులు అనుకున్నది సాధించడంలో విజయం పొందుతారు.

వ్యవసాయదారులకు సామాన్యంగానే ఉంటుంది.

మహిళలకు కుటుంబంలో ఒడిదుడుకులు ఎదురుకావచ్చు.

జనవరి, మే, జూలై, సెప్టెంబర్‌ నెలలు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి.

అదృష్టసంఖ్య–5,

ఆకుపచ్చ, నేరేడు, కాఫీ రంగులు అనుకూలిస్తాయి.

నిత్యం శ్రీ వెంకటేశ్వరస్వామి ని పూజించడం మంచిది

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces