Yearly Sunsign Horoscope

01st January, 2020 to 31st December, 2020

Gemini

మిథునం(22nd May – 22nd June)

కొత్త కొత్త అంచనాలతో ముందుకు సాగుతారు.

ఆప్తుల నుంచి తరచూ సహాయసహకారాలు అందుకుంటారు.

చేపట్టిన కార్యక్రమాలను ఎవరి సహాయం లేకుండానే పూర్తి చేస్తారు.

కుటుంబ సభ్యులను మీ మాటలతో ఆకట్టుకుని ప్రేమానురాగాలు పొందుతారు.

జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన ఎదురుకావచ్చు.

తరచూ ఇంట్లో శుభకార్యాలు నిర్వహించే వీలుంది. ఇందుకు సన్నాహాలు చేస్తుంటారు.

అవసరాలకు తగినట్లుగా ఆదాయం సమకూరుతునే ఉంటుంది. దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి.

ప్రముఖులతో పరిచయాలు, వారితో సంభాషణలు ఊరటనిస్తాయి.

చాకచక్యం, నేర్పు, సహనంతో ముందుకుసాగి క్లిష్టమైన సమస్యలు సైతం పరిష్కరించుకుంటారు.

అయితే మీ అభిప్రాయాలను కొన్ని సందర్భాలలో బంధువులు వ్యతిరేకించడం కొంత ఇబ్బంది కలిగిస్తుంది.

తీర్థ యాత్రలు, పర్యాటక ప్రాంతాలు సందర్శిస్తారు.

వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు ఎదురైనా ఏదోవిధంగా పూర్తి చేస్తారు. భాగస్వాములతో వివాదాలు మాత్రం తప్పకపోవచ్చు. లాభనష్టాలు సమానంగా ఉంటాయి.

ఉద్యోగాలలో కొన్ని బాధ్యతలు తప్పనిసరి పరిస్థితుల్లో మోయాల్సి వస్తుంది. ప్రమోషన్లు దక్కినా సంతృప్తికరంగా ఉండవు.

పారిశ్రామికవేత్తలు కొత్త కంపెనీల ఏర్పాటులో విజయం సాధిస్తారు. కొత్త సంస్థల భాగస్వామ్యం లభిస్తుంది.

రాజకీయవేత్తలు ఊహించని రీతిలో పదవులు దక్కించుకుంటారు.

కళాకారులు అవకాశాలు దక్కాయనుకున్న సమయంలో కొన్ని వివాదాలు కూడా నెలకొనవచ్చు. ఇటువంటి సందర్భంలోనే నిదానం పాటించాలి.

వ్యవసాయదారులు, రచయితలు, క్రీడాకారులకు గతం కంటే మరింత మెరుగ్గా ఉంటుంది.

మహిళలకు తరచూ కుటుంబంలో సమస్యలు ఎదురై చికాకు పరుస్తాయి. అయితే మీ ఆత్మవిశ్వాసమే రక్షగా నిలుస్తుంది.

జనవరి, మే, సెప్టెంబర్‌నెలల్లో ఆరోగ్యం పై నిర్లక్ష్యం వద్దు, ఆరోగ్య పరిరక్షణ పై శ్రద్ధ చూపండి.

ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్, ఆగస్టు, అక్టోబర్‌నెలలు అనుకూలమైనవి.

అదృష్ట సంఖ్యలు....1,4,5.

అదృష్ట రంగులు.. గులాబీ, ఆకుపచ్చ.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces