Yearly Sunsign Horoscope
01st January, 2018 to 31st December, 2018
Leo
సింహం....(జూలై 23–ఆగస్టు 22)
వీరికి అంతా అనుకూలంగా కనిపించినా మధ్యలో కొన్ని చికాకులు తప్పవు. ఆర్థికంగా కొంత అనుకూల స్థితి ఉంటుంది. కార్యక్రమాలలో విజయాలు సాధిస్తారు. కుటుంబ విషయాలలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణాలు, వాహనాలు కొనుగోలులో ముందడుగు వేస్తారు. ఆత్మీయులు, సోదరులతో సఖ్యత నెలకొంటుంది. వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం కొంత కలవరపెట్టవచ్చు. కాంట్రాక్టర్లు, రియల్ఎస్టేట్వర్గాలకు కలిసివచ్చే సమయం. వివాదాల నుంచి బయటపడతారు.వ్యాపారులు, వాణిజ్యవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కళాకారులు, పారిశ్రామికవేత్తలకు అనుకూల పరిస్థితులు. రాజకీయవేత్తలకు పదవీయోగం. క్రీడాకారులు కొన్ని విజయాలు సాధిస్తారు. మహిళలకు అనుకూల సమాచారం.
ఫిబ్రవరి, మార్చి, సెప్టెంబర్, నవంబర్నెలలు ప్రతికూలంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య, కుటుంబ సమస్యలు వేధిస్తాయి.
అదృష్టసంఖ్య–1
వీరు శివుని పూజలు చేయడం మంచిది.