Yearly Sunsign Horoscope

01st January, 2019 to 31st December, 2020

Leo

సింహం (23 జులై -22 ఆగష్టు)

ఈతి బాధల నుంచి బయటపడతారు.

ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్యలు చాలావరకూ పరిష్కారమవుతాయి.

ఆప్తులు, బంధువులు మీ పట్ల ప్రేమ కనబరుస్తారు.

స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది.

ఏ పని చేపట్టినా సకాలంలోనే పూర్తి చేసి ముందుకు సాగుతారు.

భూములకు సంబంధించిన వివాదాలు పరిష్కారానికి నోచుకుంటాయి.

భవిష్యత్‌ పై విద్యార్థులు పెట్టుకున్న ఆశలు ఫలిస్తాయి.

ఉద్యోగ ప్రయత్నాలు మరింత సానుకూలమవుతాయి.

ఆర్థిక పరిస్థితిలో పెనుమార్పులు ఉండవచ్చు. ఊహించని రీతిలో ధనలబ్ధి.

వ్యాపార లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కొత్త పెట్టుబడులు సమకూరడంతో పాటు భాగస్వాములు చేరతారు.

ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలను సాధించే దిశగా సాగుతారు. మీ పైస్థాయి అధికారులు మిమ్మల్ని ప్రశంశలతో ముంచెత్తుతారు.

రాజకీయవేత్తలు, కళాకారులు విశేష గుర్తింపు పొందుతారు. కొందరికి పదవులు దక్కవచ్చు.

వ్యవసాయదారులు పంటల సాగులో విజయాలు సాధిస్తారు.

మహిళలకు పుట్టింటి వారి నుంచి లబ్ధి చేకూరే అవకాశం.

ఫిబ్రవరి, మార్చి, జూలై, సెప్టెంబర్‌ నెలల్లో ప్రతిబంధకాలు, వివాదాలు, మానసిక అశాంతి.

అదృష్ట సంఖ్య–1.

గులాబీ, నేరేడు, చాక్లెట్‌ రంగులు అనుకూలం.

నిత్యం సూర్య భగవానుణ్ణి పూజించడం మంచిది

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces