Yearly Sunsign Horoscope

01st January, 2020 to 31st December, 2020

Leo

సింహం(23rd July – 22nd August)

ఈ ఏడాది మిగతా రాశుల కంటే వీరికి అద్భుతమైన కాలమనే చెప్పాలి.

వీరు ఏ కార్యక్రమం చేపట్టినా విజయమే. అయితే మధ్యమధ్యలో కొన్ని అవాంతరాలు ఎదురైనా తాత్కాలికమే.

గతంలో జారవిడుచుకున్న వస్తువులు భద్రంగా మీచేతికందే సూచనలు.

చిరకాల ప్రత్యర్థులను కూడా మీ దారికి తెచ్చుకుని ముందుకు సాగుతారు.

ఆత్మీయత, అనురాగాల మధ్య కుటుంబ సభ్యులతో గడుపుతారు.

కుటుంబంలో వివాహాది శుభకార్యాలు విస్తృతంగా చేపడతారు.

విద్యార్థులకు అనుకున్న అవకాశాలు మరింత చేరువ కాగలవు.

రాబడి అనూహ్యంగా పెరిగి అప్పులు సైతం తీరే మార్గం ఏర్పడుతుంది.

జీవితంలో మరపురాని సంఘటన ఒకటి ఎదురయ్యే వీలుంది.

తరచూ తీర్థ యాత్రలు, పర్యాటక ప్రాంతాలు సందర్శిస్తారు.

కొత్తకొత్త పరిచయాలు మీలో ఉత్సాహాన్ని నింపుతుంది.

కాంట్రాక్టర్లకు మరింత లాభదాయకమైన కాలం. అయితే కొన్ని సందర్భాలలో శ్రమపడాలి.

విద్యార్థులు, నిరుద్యోగులు అనుకోని అవకాశాలు దక్కి సద్వినియోగం చేసుకుంటారు.

కార్లు, స్కూటర్లు, ఇళ్లు కొనుగోలు చేస్తారు.

వ్యాపారస్తులకు భాగస్వాములతో వివాదాలు పరిష్కారం. విస్తరణ కార్యక్రమాలు మరింతగా చేపడతారు. పెట్టుబడులకు వెనుకడుగు వేయరు.

ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కుతాయి. అలాగే, పదోన్నతులతో కూడిన బదిలీలు ఉండవచ్చు.

పారిశ్రామికవేత్తలకు కొత్త కంపెనీల ఏర్పాటులో అనుకూల వాతావరణం.

రాజకీయవేత్తలకు పదవులు దక్కుతాయి. కాగా, ద్వితీయార్థంలో కొంత వ్యతిరేక పరిస్థితులు ఎదుర్కొంటారు.

కళాకారులకు ఊహించని అవకాశాలు, విశేష ప్రశంసలు, అవార్డులు రావచ్చు.

వ్యవసాయదారులు, క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు అందవచ్చు.

మార్చి, జూలై, నవంబర్‌నెలలో ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించడం మంచిది.

ఏప్రిల్, జూన్,ఆగస్టు, అక్టోబర్, డిసెంబర్‌నెలలు విశేష యోగదాయకమైనవి.

అదృష్ట సంఖ్యలు...1, 5,9.

అదృష్ట రంగులు..ఎరుపు, ఊదారంగు.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces