Yearly Sunsign Horoscope

01st January, 2020 to 31st December, 2020

Libra

తుల( 23 September- 22 october)

ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేయాలన్న పట్టుదలతో ముందుకు సాగుతారు.

ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుకుంటారు.

కొత్త కాంట్రాక్టులకు చేసే యత్నాలు సానుకూలమవుతాయి.

స్నేహితులతో విభేదాలు కొంత ఇబ్బందికరంగా మారవచ్చు. అయితే వారితో సమన్వయం కోసం ప్రయత్నిస్తారు.

బంధువుల సహాయసహకారాలు పూర్తిగా అందుకుంటారు.

స్థిరాస్తి వివాదాలు కొంత పరిష్కారమై లబ్ధి చేకూరుతుంది.

విద్యార్థులు, నిరుద్యోగులకు అవకాశాలు పెరుగుతాయి.

ఒక సంఘటన మిమ్మల్ని ఆకట్టుకుంటుంది.

మీ పై కొన్ని అభియోగాలు వచ్చినా దీటుగా ఎదుర్కొని ముందడుగు వేస్తారు.

ఆదాయానికి మధ్యమధ్యలో కొంత ఇబ్బంది ఏర్పడినా చాకచక్యంగా అధిగమిస్తారు.

కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఇందుకు తగిన ఏర్పాట్లలో నిమగ్నవుతారు.

వ్యాపారులు ప్రథమార్ధంలో కొంత నిరాశ చెందినా క్రమేపీ లాభాల బాటలో నడుస్తారు. భాగస్వాములు సైతం మీకు పూర్తిగా సహకరిస్తారు.

ఉద్యోగులకు ప్రమోషన్లు లభించే సమయం. అయితే సహచరుల అలసత్వానికి మీరు మాటపడాల్సిన పరిస్థితి ఉంటుంది, అప్రమత్తత అవసరం.

పారిశ్రామికవేత్తలు కొత్త కంపెనీల ఏర్పాటు పై దృష్టి సారించి కొంత విజయం సాధిస్తారు.

రాజకీయవేత్తలకు పదవులు ఊరిస్తాయి. తరచూ విదేశీ పర్యటనలు జరుపుతారు.

కళాకారులు తమ ప్రతిభను చాటుకుంటారు.

వ్యవసాయదారులు, క్రీడాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ప్రథమార్థం మరింత కలసి వస్తుంది.

మహిళలకు మొత్తం మీద ఈతి బాధలు తొలగి ఊరట లభిస్తుంది.

జనవరి, మే, సెప్టెంబర్‌నెలలు ఆరోగ్యపరంగా ఇబ్బందిగా ఉంటుంది. తగిన ఆరోగ్య సూత్రాలు పాటించండి.

ఇక ఫిబ్రవరి, జూన్, ఆగస్టు, అక్టోబర్, డిసెంబర్‌నెలలు విశేష యోగదాయకమైనవి.

అదృష్ట సంఖ్యలు...2,5,6.

అదృష్ట రంగులు...లేత నీలం, నేరేడు

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces