Yearly Sunsign Horoscope
01st January, 2019 to 31st December, 2020
Pisces
మీనం (23 ఫిబ్రవరి - 20 మార్చ్)
అందరి ప్రేమను పొందుతారు.
మీకు ఎదురులేని పరిస్థితి అనే చెప్పాలి.
ప్రథమార్థం కంటే ద్వితీయార్థం మరింత సానుకూలం.
ఏ పని చేపట్టినా విజయవంతంగా ముగిస్తారు.
అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రతిభ చాటుకుంటారు.
కుటుంబంలో ఒకరి వివాహ వేడుకలు నిర్వహిస్తారు.
సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి.
జీవిత భాగస్వామితో ఎంతోకాలంగా నెలకొన్న వివాదాలు పరిష్కరించుకుంటారు.
ఆస్తుల వ్యవహారంలో ఒడిదుడుకులు తొలగుతాయి.
సంతానం విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు అందర్నీ మెప్పిస్తాయి.
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. రుణ బాధలు తొలగుతాయి.
వ్యాపారస్తులు ఉత్సాహంగా ముందుకు సాగి లాభాలు అందుకుంటారు.
ఉద్యోగస్తులకు హోదాలు సంతృప్తినిస్తాయి. పై స్థాయి అధికారుల మనస్సులను గెలుచుకుంటారు.
పారిశ్రామికవేత్తలు, కళాకారులకు పట్టింది బంగారమే. ఏడాది చివరిలో మరిన్ని విజయాలు సాధిస్తారు.
వ్యవసాయదారులు పెట్టుబడులు సమీకరణలో సఫలమవుతారు.
మహిళలకు ఈతిబాధలు తొలగుతాయి.
ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్, సెప్టెంబర్, అక్టోబర్ వ్యతిరేక ఫలాలు ఉండవచ్చు. ముందస్తు జాగ్రత్తలు మంచిది.
అదృష్ట సంఖ్య–3
గులాబీ, ఆకుపచ్చ, తెలుపు రంగులు అనుకూలం.
ప్రతి నిత్యం సాయిబాబా వారిని మరియు గణపతి ని పూజించడం మంచిది