Yearly Sunsign Horoscope

01st January, 2020 to 31st December, 2020

Pisces

మీనం(23rd February – 20th March)

మధ్యమధ్యలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తూ ముందడుగు వేస్తారు.

మొత్తంమీద విశేషయోగకాలమని చెప్పాలి.

ఎటువంటి కార్యక్రమమైనా పూర్తి చేసే వరకూ నిద్రపోరు.

మీ శక్తిసామర్థ్యాలు పదిమందికీ తెలుస్తాయి.

ఆదాయం గతంతో పోలిస్తే మరింత మెరుగుపడుతుంది. రుణాలు తీరి ఉపశమనం పొందుతారు.

ఆస్తుల వ్యవహారాలలో నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగుతుంది. కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు.

ప్రత్యర్థులను మాత్రం తక్కువగా అంచనా వేయవద్దు. అలాగే, ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ముఖ్యంగా ప్రథమార్థం మరింత జాగ్రత్తలు పాటించాలి.

నిరుద్యోగులు, విద్యార్థులకు మరిన్ని విజయాలు చేకూరతాయి.

మీ పై అభాండాలు మోపిన వారే ప్రశంసలు కురిపిస్తారు.

కుటుంబంలో వివాహ యత్నాలు సఫలమవుతాయి.

సోదరులు, సోదరీల ఆప్యాయత పొందుతారు.

వ్యాపారాలు క్రమేపీ విస్తరిస్తూ అభివృద్ధిపథంలో సాగుతారు. కొత్త పెట్టుబడులు మరింతగా దక్కుతాయి. భాగస్వాములతో వివాదాలు తీరే అవకాశం.

ఉద్యోగాలలలో ఊహించని విధంగా పదోన్నతులు దక్కుతాయి. అలాగే, ఇష్టమైన మార్పులు కూడా పొందుతారు.

పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు ఉంటూనే ఉంటాయి.

రాజకీయవేత్తలకు కొత్త పదవులు లభించే వీలుంది.

కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి.

వ్యవసాయదారులు, టెక్నాలజీ రంగ నిపుణులు, రచయితలకు ఏడాది రెండవ భాగం మరింత సానుకూలంగా ఉంటుంది.

మహిళలకు మధ్యలో కొన్ని సమస్యలు ఎదురైనా సర్దుబాటు కాగలవు.

ఫిబ్రవరి, జూన్, అక్టోబర్‌నెలల్లో ఆరోగ్యం పై శ్రద్ధ వహించండి. తరచూ వైద్య సేవలు తప్పకపోవచ్చు.

జనవరి, మార్చి, మే, జూలై, నవంబర్‌నెలలు అత్యంత యోగదాయకమైనవిగా చెప్పవచ్చు.

అదృష్ట సంఖ్య...2,5,9.

అదృష్ట రంగులు...పసుపు, తెలుపు.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces