Yearly Sunsign Horoscope

01st January, 2018 to 31st December, 2018

Sagittarius

 ధనుస్సు...(నవంబర్‌23–డిసెంబర్‌21)

ప్రతి విషయంలోనూ కొంత అప్రమత్తత అవసరం. ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువుల నుంచి కొంత సహాయసహకారాలు ఉంటాయి. స్థిరాస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. భార్యాభర్తల మధ్య వివాదాలు కొంతవరకూ పరిష్కారమవుతాయి. మీపై వచ్చిన అపవాదులు తొలగుతాయి. వాహనాలు నడిపే విషయంలో అప్రమత్తత అవసరం. విద్యార్థులు మరింత ఓపిక, సహనంతో మెలగాలి. అలాగే పట్టుదల పెంచుకుంటే మంచిది. ఇంటి నిర్మాణాలు కొలిక్కి వస్తాయి. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. రావలసిన బాకీలు కొంతమేరకు అందుతాయి. వ్యాపారులు, వాణిజ్యవర్గాలకు ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారుల యత్నాలు సానుకూలం. క్రీడాకారులకు ద్వితీయార్ధంలో శుభవార్తలు. విజయాలు.

 జనవరి, మార్చి,జూన్,జూలై, నవంబర్‌నెలలు ప్రతికూలం. ఈ కాలంలో ధన నష్టం. కుటుంబంలో సమస్యలు. మానసిక ఆందోళన.

అదృష్ట సంఖ్య–3

ప్రతి నిత్యం హనుమాన్‌ఛాలీసా పఠించాలి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces