Yearly Sunsign Horoscope

01st January, 2019 to 31st December, 2020

Sagittarius

ధనుస్సు  (23 నవంబర్ - 22 డిసెంబర్) 

ప్రతి వ్యవహారంలోనూ ప్రథమార్థంలో ఆచితూచి ముందుకు సాగడం మంచిది.

బంధువులు, మిత్రులతో కొంత పొసగక నిరుత్సాహం చెందుతారు.

మీరు సాయం అందించినవారే ఎదురు తిరిగి మనస్తాపం కలిగిస్తారు.

తరచూ తీర్థ యాత్రలు సాగిస్తారు.

మీరు తీసుకునే నిర్ణయాల పై ఒకటికి రెండుసార్లు ఆలోచన అవసరం.

సోదరులు, సోదరీల నుంచి ఆశించిన సాయం అందుతుంది.

ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు.

విద్యార్థులు, నిరుద్యోగులకు ద్వితీయార్థం శుభదాయకంగా ఉంటుంది.

ఇంటిలో శుభకార్యాల నిమిత్తం సొమ్ము ఖర్చు చేస్తారు.

కాంట్రాక్టులు ఎట్టకేలకు దక్కించుకుంటారు.

వ్యాపారస్తులు లాభాల బాటలో పయనిస్తారు. పెట్టుబడులు సమకూరి ఉత్సాహంగా గడుపుతారు.

ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు సంభవం. పై స్థాయి అధికారుల మెప్పు కోసం తాపత్రయపడతారు.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు తరచూ విదేశీ పర్యటనలు చేస్తారు.

మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

జనవరి, మార్చి, జూలై, నవంబర్‌ నెలలు ప్రతికూలం. ఆరోగ్యం, కుటుంబ విషయాలలో ఇబ్బందులు నెలకొనవచ్చు.

అదృష్ట సంఖ్య–3

నేరేడు, ఎరుపు, తెలుపు రంగులు అనుకూలం.

నిత్యం దత్తాత్రేయ స్వామి ని మరియు ఆంజనేయ స్వామి  ని పూజించడం మంచిది

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces