Yearly Sunsign Horoscope

01st January, 2020 to 31st December, 2020

Sagittarius

ధనుస్సు(23rd November – 22nd December)

చేసే ప్రతిపనిపైనా మరింత ఏకాగ్రత చూపండి.

బంధువులు, స్నేహితులతో విభేదాలు నెలకొనే అవకాశం. అయితే సర్దుబాటు చేసుకునేందుకు యత్నిస్తునే ఉంటారు.

ఒక వ్యక్తి ద్వారా మీరు మాటపడాల్సిన పరిస్థితి రావచ్చు.

ప్రతి నిర్ణయాన్ని మరింత ఆలోచించి తీసుకుంటే మేలు.

చిత్రవిచిత్ర సంఘటనలు మిమ్మల్ని ఆకట్టుకుంటాయి.

విలువైన ఆభరణాలు, వాహనాలు భద్రంగా కాపాడుకోండి.

బంధువర్గం మీ పై నెపాలు మోపవచ్చు, మౌనమే మంచిది.

ఇక ఆదాయ, వ్యయాలు సమానంగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఖర్చులు తలకు మించిన భారంగా మారవచ్చు.

లౌక్యంతో వ్యవహరిస్తేనే ముందుకు సాగగలరు.

అతిగా ఎవరినీ విశ్వసించవద్దు, కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

కాంట్రాక్టర్లు అందిన అవకాశాలనే చే జార్చుకుంటారు.

వ్యాపారస్తులకు లాభనష్టాలు సమానంగా ఉంటాయి. విస్తరణ కోసం చేసే యత్నాలు ద్వితీయార్థం కొంత ఫలిస్తాయి.

ఉద్యోగులు విధుల్లో మరింత మెలకువ పాటిస్తూ, సమర్థవంతంగా ముందుకు సాగాల్సి ఉంటుంది.

పారిశ్రామికవేత్తలకు అంచనాలు తప్పుతాయి. విదేశీ పర్యటనలు కుదిస్తారు.

రాజకీయవేత్తలకు పదవులు ఊరిస్తాయే గానీ దరిచేరవు.

కళాకారులకు కొన్ని అవకాశాలు అతికష్టం పై లభిస్తాయి.

వ్యవసాయదారులు, క్రీడాకారులు, సాంకేతిక నిపుణులకు కొంతలో కొంత అనుకూల స్థితి.

మహిళలకు తరచూ వివాదాలు, మానసిక అశాంతి.

మార్చి, జూలై, నవంబర్‌నెలలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించండి. తరచూ వైద్య సలహాలు పొందాల్సి వస్తుంది.

ఇక ఫిబ్రవరి, ఏప్రిల్, ఆగస్టు, అక్టోబర్‌ , డిసెంబర్‌నెలలు విశేషంగా కలిసివచ్చే  నెలలు.

అదృష్ట సంఖ్యలు...2,5,9.

అదృష్ట రంగులు...పసుపు, గులాబీ.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces