Yearly Sunsign Horoscope
01st January, 2018 to 31st December, 2018
Scorpio
వృశ్చికం....(అక్టోబర్23–నవంబర్22)
ఎంతోకాలంగా నిరీక్షిస్తున్న ప్రముఖుల నుంచి ముఖ్య సందేశం అందుతుంది. అదనపు రాబడి ఉత్సాహాన్నిస్తుంది., రావలసిన సొమ్ము సైతం అందుతుంది. బంధువర్గంతో చర్చలు ఫలప్రదమవుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటారు. మీపై మోపిన అభియోగాలు సమసిపోతాయి. విద్యార్థులు ఊహించని అవకాశాలు అందుకుంటారు. చేపట్టిన కార్యక్రమాలను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. వాహనాలు, స్థలాలు కొంటారు. మధ్యమధ్యలో ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. వ్యాపారులు, వాణిజ్యవర్గాలకు లాభాలు ఉత్సాహాన్నిస్తాయి. పెట్టుబడులకు అనుకూలం. రాజకీయవేత్తలు, కళాకారులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. కాంట్రాక్టర్లు అనుకున్న పనులు చేజిక్కించుకుంటారు.ఐటీ నిపుణులు, క్రీడాకారులు గుర్తింపు పొందుతారు. వాహన, కుటుంబ సౌఖ్యం.
ఫిబ్రవరి, మే, జూన్, అక్టోబర్నెలలు ప్రతికూలం. ఈ కాలంలో ప్రతి విషయంలోనూ ప్రతిబంధకాలు, వివాదాలు. మానసిక అశాంతి వంటి ఫలితాలు ఉంటాయి.
అదృష్టసంఖ్య–9,
ప్రతి శనివారం రావి,వేపచెట్టు చుట్టూ ప్రదక్షణలు చేయడం ఉత్తమం.