Yearly Sunsign Horoscope

01st January, 2020 to 31st December, 2020

Scorpio

వృశ్చికం(23rd October – 22nd November)

విశేష ప్రజ్ఞాపాటవాలను ప్రదర్శించి అందరి మెప్పు పొందుతారు.

ఏ కార్యక్రమమైనా అవలీలగా పూర్తి చేసే వరకూ విశ్రమించరు.

ఆస్తుల వ్యవహారాలలో నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగి లబ్ధి పొందుతారు.

ఆదాయ మార్గాలు మరింత పెరుగుతాయి. రుణ బాధలు తగ్గే సూచనలు.

స్నేహితులతో కష్టసుఖాలు పంచుకుంటూ ముందుకు సాగుతారు.

వివాహాది వేడుకలకు విశేషంగా ఖర్చు చేస్తారు.

వాహనచోదకులు మాత్రం అప్రమత్తంగా మెలగాలి. వీరు వాహనాలు నడిపే సందర్భంలో నిర్లక్ష్యం వీడాలి. అలాగే, విష జంతువుల విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలి.

మీ ఆశయాలు, లక్ష్యాలు సాధించేందుకు తగిన కాలం.

ద్వితీయార్థంలో ఇళ్లు, వాహనాలు కొంటారు.

విద్యార్థులు అనూహ్యమైన ఫలితాలు రాబడతారు.

నిరుద్యోగులకు ఉద్యోగ లాభం.

ప్రయాణాలలో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఉపకరిస్తాయి.

కొన్ని సమస్యలు ఎదురైనా పట్టుదలతో పరిష్కరించుకుంటారు.

ఆధ్యాత్మిక భావాలు మరింత పెంచుకుంటారు.

భార్యాభర్తల మధ్య అపార్ధాలు క్రమేపీ తొలగుతాయి. అన్యోన్యత పెరుగుతుంది.

వ్యాపారస్తులకు ద్వితీయార్థం విశేష లాభాలు అందుతాయి. కొత్త పెట్టుబడులు సమకూరి విస్తరణ కార్యక్రమాలు చేపడతారు.

ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కుతాయి. విధుల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. సమర్థతను చాటుకుంటారు.

పారిశ్రామిక,రాజకీయవేత్తలకు విశేష యోగదాయకమైన కాలం. ముఖ్యంగా రాజకీయవేత్తలకు కొత్త పదవులు లభించవచ్చు.

కళాకారులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు.

వ్యవసాయదారులు, క్రీడాకారులు, పరిశోధకులకు గుర్తింపుతో పాటు, ప్రభుత్వపరమైన ప్రోత్సాహం అందుతుంది.

మహిళలు స్వశక్తి పై ఆధారపడి కొన్ని విజయాలు సాధిస్తారు.

ఫిబ్రవరి, జూన్, అక్టోబర్‌నెలల్లో ఆరోగ్యపరంగా చికాకులు, వైద్య సేవలు అవసరమవుతాయి.

ఇక జనవరి, మార్చి, జూలై, సెప్టెంబర్, నవంబర్‌నెలలు అన్ని విధాలుగా కలసి వచ్చే కాలం.

అదృష్ట సంఖ్యలు..అదృష్టసంఖ్యలు..1,9,5.

అదృష్ట రంగులు...గులాబీ, పసుపు.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces