Yearly Sunsign Horoscope
01st January, 2018 to 31st December, 2018
Taurus
వృషభం....(ఏప్రిల్21–మే 21)
ముఖ్య కార్యక్రమాలు కొంత నెమ్మదిగా పూర్తి చేస్తారు. బంధువర్గంతో కొద్దిపాటి వివాదాలు నెలకొన్నా క్రమేపీ సర్దుబాటు కాగలవు. విలువైన వస్తువులు చేజారడం, మనశ్శాంతి లోపించడం వంటివి ఎదురవుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యతకు కొంత విఘాతం కలిగే సూచనలు. ఆస్తి వ్యవహారాలు ఇబ్బందికరంగా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులు మీ పట్ల విధేయులై ఉంటారు. ఆర్థికంగా కాస్త ఊరట లభిస్తుంది. అయితే అదనపు ఖర్చులు మీదపడి రుణాలు చేస్తారు. సంఘంలో హోదా, గౌరవం పెరిగినా కుటుంబంలో చికాకులు తలనొప్పిగా మారతాయి. తీర్థయాత్రలు తరచూ చేస్తారు. కోర్టు కేసులలో మిశ్రమ తీర్పులు వస్తాయి. ఇళ్లు, వాహనాలు కొనుగోలు యత్నాలు నెమ్మదిగా కలిసివస్తాయి. వ్యాపారాలు, వాణిజ్యవర్గాలకు లాభ నష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగులు కోరుకున్న బదిలీలు పొందుతారు. అలాగే, విధుల్లో ప్రతిబంధకాలు అధిగమిస్తారు. రాజకీయవేత్తలు, కళాకారులు, వ్యవసాయదారులకు ఊరట లభిస్తుంది. పారిశ్రామికవేత్తలు కొత్త సంస్థల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తారు. క్రీడాకారులు, విద్యార్థులు ప్రతిభను చాటుకుంటారు.
ఏప్రిల్, జూన్, ఆగస్టు, అక్టోబర్, నవంబర్నెలలు ప్రతికూలం. ఈ కాలంలో నిర్ణయాలలో తొందరవద్దు. ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపండి. వివాదాలకు దూరంగా మెలగాలి.
అదృష్ట సంఖ్య –6. వీరు
సూర్యారాధనలు, అమ్మవారికి ప్రత్యేక అర్చనలు చేయాలి.