Yearly Sunsign Horoscope

01st January, 2019 to 31st December, 2020

Taurus

వృషభం   (21 ఏప్రిల్ - 21 మే)

పరిమితంగా మాట్లాడుతూ ముందుకు సాగడం ఉత్తమం.

మీ సత్తా నిరూపించుకునేందుకు సరైన సమయం.

బంధువులు, మిత్రులు మీ సహనాన్ని పరీక్షించేందుకు యత్నిస్తారు.

అయితే మీదే పై చేయిగా నిలుస్తుంది.

అనుకున్న పనులు, కార్యాలు మధ్యలో కొన్ని ఆటంకాలు ఎదురైనా దిగ్విజయంగానే సాగుతాయి.

అందరి మనస్సులు గెలుచుకుని మీ గౌరవ ప్రతిష్ఠలను పెంచుకుంటారు.

అవివాహితులకు వివాహ కాలం.

నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగాలు దక్కించుకుంటారు.

ఆర్థికంగా ఇబ్బందులు తొలగి లబ్ధి పొందుతారు. రావలసిన డబ్బు అందుతుంది.

కుటుంబంలో మీపట్ల వ్యతిరేకత తొలగుతుంది.

ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగించినా ఉమశమనం పొందుతారు.

వ్యాపారాలు క్రమేపీ లాభాల దిశగా కొనసాగుతాయి.

ఉద్యోగాలలో అనుకున్న హోదాలు తథ్యం.

పారిశ్రామికవర్గాలు, కళాకారులకు కొత్త అవకాశాలు దక్కే ఛాన్స్‌. అయితే కొంత శ్రమ కూడా తప్పదు.

వ్యవసాయదారులు ఆచితూచి ముందుకు సాగాలి.

మహిళలు అన్ని రంగాల్లోనూ ఆధిపత్యాన్ని చాటుకుంటారు.

ఏప్రిల్, జూన్, ఆగస్టు, నవంబర్, డిసెంబర్‌ నెలలు కొంత వ్యతిరేకంగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలి.

అదృష్టసంఖ్య–6.

నీలం, ఆకుపచ్చ, పసుపు రంగులు విజయానికి సూచికగా ఉంటాయి.

నిత్యం దుర్గా అమ్మవారిని పూజించడం మంచిది

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces