Yearly Sunsign Horoscope

01st January, 2020 to 31st December, 2020

Taurus

వృషభం(21st April – 21st May)

వీరికి శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ అనే విధంగా ఉంటుంది.

ఏ కార్యక్రమైనా శ్రమాధిక్యంతోనే పూర్తి చేస్తారు.

ఆలోచనలు పరిపరివిధాలుగా ఉండి మానసిక ప్రశాంతత ఉండదు.

తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుని కొంత ఆందోళన చెందుతారు.

స్నేహితులలో ఒకరు మీకు ఎనలేని విధంగా సహాయపడతే అవకాశం ఉంది.

కొన్ని సమస్యలు అతికష్టం మీద పరిష్కరించుకుంటారు.

ఆత్మీయులతో సఖ్యత కోసం చేసే యత్నాలు కొంత ఫలిస్తాయి.

ప్రత్యర్థులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.

అయితే కుటుంబంలో వివాహాది వేడుకలు జరిగే వీలుంది.

ఆదాయం సమకూరినా ఏదో ఒక ఖర్చు ఎదురవుతునే ఉంటుంది.

విద్యార్థులకు ఫలితాలు అనుకూలించినా సంతృప్తికరంగా ఉండవు.

గృహం కొనుగోలు లేదా నిర్మాణాల విషయంలో కొంత కదలికలు కనిపిస్తాయి.

ఇక వాహనచోదకులు మాత్రం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.

వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలు అతికష్టం మీద పూర్తి చేస్తారు. లాభనష్టాలు సమానంగా ఉంటాయి.

ఉద్యోగాలలో ఆకస్మిక బదిలీలు ఉండవచ్చు. తరచూ మార్పులకు సిద్ధపడాలి. ఉన్నతాధికారులు ఒత్తిడులు పెంచుతారు.

పారిశ్రామికవేత్తలు విదేశీ పర్యటనల ఫలితం కొంత పొందుతారు.

రాజకీయవేత్తలకు ప్రజాదరణ కొంత తగ్గి నిరాశ చెందుతారు. పదవులు కొన్ని చేజారే వీలుంది.

కళాకారులు, పరిశోధకులు, రచయితలకు కొంతవరకూ అనుకూలత ఉంటుంది.

వ్యవసాయదారులు, టెక్నాలజీ రంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి.

మహిళలు తండ్రి తరఫు వారితో విభేదిస్తారు. అయితే ఆభరణాలు, భూములు సమకూరతాయి.

ఏప్రిల్, ఆగస్టు, డిసెంబర్‌నెలలు ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి.

ఇక జనవరి, మార్చి,  మే, జూలై, సెప్టెంబర్‌నెలలు అనుకూలమైనవి.

అదృష్ట సంఖ్యలు...2,5,6.

అదృష్ట రంగులు...గులాబీ, పసుపు.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces