Yearly Sunsign Horoscope

01st January, 2019 to 31st December, 2020

Virgo

కన్య (23 ఆగష్టు -22 సెప్టెంబర్)

అనుకున్న కార్యక్రమాలలో కొద్దిపాటి ఆటంకాలు ఎదురవుతున్నా పట్టుదలతో పూర్తి చేస్తారు.

ప్రముఖులు పరిచయమై సహాయపడతారు.

విద్యార్థులు, నిరుద్యోగులు సత్తా చాటుకునేందుకు చేసే యత్నాలు సఫలమవుతాయి.

స్థిరాస్తి వివాదాలు క్రమేపీ పరిష్కారమవుతాయి.

ద్వితీయార్థమంతా శుభకార్యాల నిర్వహణ, హడావిడితో గడుపుతారు.

సంతానపరంగా నెలకొన్న ఇబ్బందులు తొలగుతాయి.

కొన్ని కేసుల నుంచి గట్టెక్కుతారు.

కాంట్రాక్టుల విషయంలో అనుకున్నది సాధిస్తారు.

తరచూ తీర్థ యాత్రలు చేస్తారు.

వ్యాపారాలు ప్రథమార్థంలో ఆటుపోట్లు ఎదురైనా అధిగమించి లాభాల బాటపడతారు.

ఉద్యోగాలలో జరిగే మార్పులు మీకు ఎంతో ఉత్సాహాన్నిస్తాయి. ఉన్నతాధికారులు కూడా మీ పనితనాన్ని మెచ్చుకుని అభినందనలు చెప్పడం విశేషం.

పారిశ్రామికవేత్తలు, కళాకారులు తమ ప్రతిభ చాటుకుంటారు.

వ్యవసాయదారులకు పెట్టుబడులు అందుతాయి.

మహిళలకు స్థిరాస్తి లాభాలు ఉండవచ్చు.

మార్చి, ఏప్రిల్, ఆగస్టు, అక్టోబర్, డిసెంబర్‌ నెలలు ప్రతికూలం. ఈ కాలంలో అన్ని విషయాలలోనూ అప్రమత్తత అవసరం. ముఖ్యంగా ఆరోగ్యం, కుటుంబం పై దృష్టి పెట్టాలి.

అదృష్ట సంఖ్య–5

పసుపు, నీలం, బంగారు రంగులు అనుకూలం.

నిత్యం దుర్గ అమ్మవారిని పూజించడం మంచిది

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces