Yearly Sunsign Horoscope

01st January, 2020 to 31st December, 2020

Virgo

కన్య(23rd August – 22nd September)

అందరి చేత శెహభాష్‌అనిపించుకుంటూ ముందుకు సాగుతారు.

ఎంతటి సమస్యలు ఎదురైనా అలవోకగా పరిష్కరించుకునే శక్తిని సంపాదిస్తారు.

ఆస్తుల వ్యవహారాలు, పెండింగ్‌కేసులు కొన్ని పరిష్కారమై ఊరట లభిస్తుంది.

అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముల మధ్య కొంతకాలంగా తగ్గిన ఆప్యాయతలు తిరిగి పొందుతారు.

ఆదాయం రెట్టింపు అయినా కూడా ఖర్చులు వాటికి తగ్గట్టుగానే ఉంటాయి. దుబారా తగ్గించుకోవడం ఉత్తమం.

బంధువులు, స్నేహితులు మీ పట్ల మరింత ప్రేమ కనబరుస్తారు. వారికి కూడా మీరు ఇతోధికంగా సహకరిస్తారు.

చేపట్టిన కార్యక్రమం ఎంతటిదైనా అవలీలగా స్వశక్తితో పూర్తి చేస్తారు.

ఇళ్ల నిర్మాణాలు సైతం చేపడతారు. ఈ రాశి వారికి స్వగృహ ప్రాప్తి కలుగుతుంది.

విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు.

నిరుద్యోగులకు అవకాశాలు పెరిగి ఉపాధి దక్కుతుంది.

వివాహాది వేడుకకు మీ ఇల్లు చిరునామాగా మారనున్నది.

తరచూ తీర్థ యాత్రలు చేస్తారు.

వ్యాపారస్తులకు ఆశించినంతగా లాభాలు అందుతాయి. అయితే భాగస్వాములతో కొన్ని విషయాలలో విభేదించాల్సిన పరిస్థితి రావచ్చు.

ఉద్యోగులు విధులలో ప్రతిబంధకాలు, ఒత్తిడులు ఎదురైనా అధిగమిస్తారు. ఆత్మవిశ్వాసం, ఉన్నత స్థానంలోని సహకారం ఉపకరిస్తాయి.

పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు ఫలప్రదమవుతాయి.

రాజకీయవేత్తలకు కొత్త పదవులు దక్కవచ్చు.

కళాకారులు నైపుణ్యాన్ని , ప్రతిభను చాటుకుంటారు.

వ్యవసాయదారులు, సాంకేతిక నిపుణులు, క్రీడాకారులకు  మధ్యలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తూ, ముందుకు సాగి విజయాలు సాధిస్తారు.

మహిళలకు మానసికంగా ప్రశాంతత చేకూరుతుంది.

ఏప్రిల్, ఆగస్టు, డిసెంబర్‌నెలలు ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించే సమయం. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మేలు.

ఇక జనవరి, మే, జూలై, సెప్టెంబర్, నవంబర్‌నెలలు లాభదాయకమైనవిగా చెప్పవచ్చు.

అదృష్ట సంఖ్యలు...1,4,5.

అదృష్ట రంగులు..సిమెంట్, ఆకుపచ్చ.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces