మకరం...
ఉద్యోగ, వివాహయత్నాలు సానుకూలం. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆస్తి విషయాల్లో అగ్రిమెంట్లు చేసుకుంటారు. వాహనాలు, గృహోపకరణాలు కొంటారు. ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు. రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత స్థాయి నుంచి పిలుపు. పారిశ్రామిక, కళారంగాల వారికి కొత్త అవకాశాలు.