మేషం
పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు.
ఆలోచనలు వెనువెంటనే అమలుకు సిద్ధపడతారు.
అందరిలోనూ గౌరవప్రతిష్ఠలు మరింత పెరుగుతాయి.
చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు.
సేవా, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
విద్యార్థులు నైపుణ్యానికి తగిన అవకాశాలు దక్కుతాయి.
ఉద్యోగయత్నాలలో ముందడుగు వేస్తారు.
సొమ్ముకు ఎటువంటి లోటు రాకుండా గడిచిపోతుంది.
విలాసాలకు ఖర్చు చేస్తారు.
బంధువర్గం సహాయసహకారాలు స్వీకరిస్తారు.
ఒక ముఖ్య సమస్యలు తీరే సమయం.
మీ మాటను కుటుంబంలో అంతా గౌరవిస్తారు.
సరికొత్తగా నిర్ణయాలు తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తారు.
ఆస్తులు కొనుగోలు అంశంపై కొన్ని అగ్రిమెంట్లు చేసుకుంటారు.
అయితే ఇంటి నిర్మాణంపై సందిగ్ధత నెలకొంటుంది. వాహనసౌఖ్యం.
వ్యాపారాలలో మీ అంచనాలకు అనుగుణంగా లాభార్జన ఉంటుంది.
కొంత పెట్టుబడి అంది ఊరట లభిస్తుంది.
ఉద్యోగాలలో పైస్థాయి అధికారులతో సత్సంబంధాలు నెలకొని పరిస్థితులు అనుకూలిస్తాయి.
పారిశ్రామిక, రాజకీయవేత్తలకు శ్రమ కొలిక్కి వస్తుంది.
వీరికి మరింత ఊరటనిచ్చే సమాచారం అందుతుంది.
టెక్నికల్ రంగం వారి కృషి, పట్టుదల నెరవేరతాయి.
మహిళల ఆశలు ఫలిస్తాయి.
అయితే ఈ రాశి వారు బుధ, గురువారాలు మాత్రం అన్నింటా కొంత జాగ్రత్త పడాలి.
ఆర్థికంగా హఠాత్తుగా ఇబ్బందులు, కుటుంబంలో సమస్యలు, ఉద్యోగమార్పులు, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు.
శ్రీ కాలభైరవాష్టకం పఠించండి.