మిథునం
కొన్ని వ్యవహారాలలో క్రమేపీ పూర్తి కాగలవు.
దీంతో పడిన శ్రమకు ఫలితం దక్కినట్లుంటుంది.
ఇంత కాలం ఎదురుచూసిన ఉద్యోగావకాశాలు దక్కడంతో నిరుద్యోగులు ఊరట చెందుతారు.
చిత్రమైన సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి.
ఒక ప్రకటన విద్యార్థులకు ఊరటనివ్వవచ్చు.
ముఖ్యమైన విషయాలలో రాజీపడకుండా ముందడుగు వేస్తారు.
సన్నిహితుల నిర్ణయం మీకు వరంగా మారనుంది.
సొమ్ముకు ఇబ్బందిలేకుండా గడిచిపోతుంది.
అనుకున్న బాకీలు వసూలవుతాయి.
కుటుంబ సభ్యులతో ఉన్న మనస్పర్థలు తొలగుతాయి.
కుటుంబ బాధ్యతలు పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు.
భార్యాభర్తల మధ్య అవగాహన పెరిగి తగు నిర్ణయాలు తీసుకుంటారు.
భూములు, వాహనాలు కొంటారు.
కోర్టులో ఉన్న ఒక కేసు తుది దశకు చేరుకుంటుందుం.
వ్యాపారాలలో ఇతరులకు కంటే మెరుగైన లాభాలు అందుకుంటారు. భాగస్వాములతో తగిన వ్యూహాలు రూపొందించుకుని తదనుగుణంగా విస్తరణ చర్యలు చేపడతారు.
ఉద్యోగ విధి నిర్వహణలో ఆటంకాలు అధిగమించి అధికారుల మెప్పు పొందుతారు.
అలాగే, కొన్ని మార్పులు మీ మంచికే అన్నట్లుంటుంది.
రాజకీయవేత్తలు, కళాకారులకు శుభదాయకమైన కాలం.
ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది.
టెక్నికల్ రంగం వారికి ఊహించని పర్యటనలు.
మహిళలు కుటుంబంలో మరింతగా చికాకులు.
అయితే వీరు ఆది, సోమ, మంగళ, బుధవారాలు మిశ్రమ ఫలాలు పొందుతారు.
ఇతరుల విషయాలలో జోక్యం వద్దు.
అప్పుల కోసం యత్నాలు.
నలత చేసి కొంత విశ్రాంతి తీసుకుంటారు.
ఆకస్మిక ప్రయాణాలు.
వృత్తి, వ్యాపారాలలో కొద్దిపాటి సమస్యలు.
నవగ్రహ స్తోత్రాలు పఠించండి.