సింహం
పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు.
చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అంది ఉత్సాహంగా గడుపుతారు.
ఆశయాల సాధనలో మిత్రులు, సహచరులు చేయూతనిస్తారు.
ఆప్తులతో వివాదాలు పరిష్కారమవుతాయి.
కోర్టు వివాదాల నుండి కాస్త ఉపశమనం లభిస్తుంది.
సమాజసేవలో పాలుపంచుకుంటారు.
ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
ప్రముఖుల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది.
వీరికి డబ్బుకు లోటురాదు.
వివిధ రూపాల్లో ధనలాభాలు కలిగే సూచనలు.
ఇతరులకు ఇచ్చిన బాకీలు సైతం వసూలయ్యే అవకాశాలు.
మీపై కుటుంబ సభ్యులు మరింత ఆదరణ, అభిమానం చూపుతారు.
సోదరులతో వివాదాలు సర్దుకుంటాయి. సంతానపరంగా శుభవార్తలు అందుతాయి.
వారసత్వ ఆస్తిపై నెలకొన్న స్తబ్ధత తొలగుతుంది.
బంధువులతో అంగీకారానికి వస్తారు.
వ్యాపారులు ఆశించిన లాభాలు దక్కుతాయి.
సహచర వ్యాపారులు ఇచ్చిన సలహాల మేరకు వ్యాపారాలు విస్తరిస్తారు.
ఉద్యోగాలలో మార్పులు అనివార్యమైనా అనుకూలంగానే సాగుతాయి.
మీ పనితీరుకు అందరూ ఆశ్చర్యపడతారు.
కళాకారులు, వైద్యులు, క్రీడాకారులకు విదేశీ సంస్థల నుండి ఆహ్వానాలు రావచ్చు.
అలాగే, సన్మానాలు పొందుతారు.
టెక్నికల్ రంగం వారు తమ నైపుణ్యతను చాటుకునే సమయం.
మహిళల కలలు ఫలిస్తాయి.
అయితే వీరు బుధవారం నుండి శనివారం వరకూ ప్రయాణాలలో అప్రమత్తత పాటించాలి.
అంగారక స్తోత్రాలు పఠించండి.