మీనం
ముఖ్య కార్యక్రమాలను అవాంతరాలు తట్టుకుని పూర్తి చేస్తారు.
కష్టించిన దానికి తగిన ఫలితం కనిపిస్తుంది.
ఇతరులకు చేయూతనివ్వడంలో ముందుంటారు.
మీ ఆలోచనా తీరును మిత్రులు ప్రశంసిస్తారు.
విద్యార్థులు, నిరుద్యోగుల కృషి, పట్టుదల తగు ఫలితాన్నిస్తుంది.
జీవితాన్ని మలుపు తిప్పే ఒక సమాచారం రావచ్చు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
వ్యతిరేక భావాలు ఉన్న వారిని సైతం ఆకట్టుకుంటారు.
సొమ్ముకు పడిన ఇబ్బందులు తొలగుతాయి.
రుణ దాతల ఒత్తిడుల నుండి బయటపడతారు.
పొదుపు మార్గాలు అనుసరిస్తారు.
మీ మాటే చెల్లుబాటు కాగలదు.
పట్టువిడుపు ధోరణితో వివాదాలు పరిష్కరించుకుంటారు.
మీలోని ఆత్మవిశ్వాసం సడలకుండా చూసుకుంటే ఎదురుండదు.
ఆస్తులు కొనుగోలు పై ఒక అంచనాకు వస్తారు. అలాగే, ఇంటి నిర్మాణాలపై ప్రతిష్ఠంభన తొలగుతుంది.
వ్యాపారాలలో రావలసిన పెట్టుబడులు సకాలంలో అందుతాయి.
అలాగే, పొదుపు చేసిన మొత్తాలు సైతం సమయానికి అందుతాయి.
ఉద్యోగాలలో కొన్ని మార్పులు రావచ్చు. అన్నీ మన మంచికే అన్నట్టుంటుంది.
సేవలు మరింత పెరిగినా లెక్కచేయరు.
రాజకీయవేత్తలు, వైద్యులకు శుభవర్తమానాలు అందుతాయి.
టెక్నికల్‌రంగం వారు మేథస్సును బయటపెట్టి సమస్యల నుండి గట్టెక్కుతారు.
మహిళలకు మానసిక ఆందోళన తగ్గుతుంది.
కాగా, వీరు సోమ, మంగళ, శుక్ర, శనివారాలు కొంత భారంగా గడుస్తుంది.
ఖర్చులు పెరుగుతాయి.అనారోగ్యం.
వృత్తి,వ్యాపారాలు మందగిస్తాయి.
దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.