కార్తీకమాస విశిష్ఠత

కార్తీకమాస విశిష్ఠత

కార్తీకమాస విశిష్ఠత

శివ కేశవులకు ప్రీతిపాతమైన జన్మజన్మాంతర పాపాల్ని సైతం దహింప చేసే ఈ మాసం స్నానానికి, దీపానికి, దానానికి ప్రసిద్ది చెందింది. సుందరమైన ఆహ్లాదకరమైన శరదృతువులో చంద్రుడు పుష్టి మంతుడై తన శీతలకిరణాల ద్వారా సమస్త జీవులకు శక్తిని ప్రసాదిస్తాడు.  శివకేశవులిద్దరికీ ఈ నెల ప్రీతిపాత్రమైంది కనుక ఈ నేలంతా చల్లని నీటి స్నానాలు, దీపదానాలు, ఇతర దానాలు, జపం ఉపవాసం, వనభోజనం వంటివి చేయాలి. ఈ మాసం లో రెండుబద్దలుగా ఉన్న వస్తువులు అంటే కంది పప్పు, పెసరపప్పు, మినప్పప్పు వంటి పప్పు దినుసులు  విడిచిపెట్టాలి ఈ నెలలో శ్రీ మహావిష్ణువు తులసి, జాజి పూలతోను, మహాదేవుణ్ణి మారేడు దళాలతోనూ, జిల్లేడు పూలతోను పూజించాలని శాస్త్రం చెబుతున్నది.

మహేశ్వరునికి సోమవారం అత్యంత ప్రీతిపాత్రం కనుక, సోమవారాలు ఉపవసించటం మేలు. కార్తీకమాసం లో వనభోజనాలు చేయాలని శాస్త్రం అంటుంది. రకరకాల చెట్లున్న ప్రాంతం లో ఉసిరిక చెట్టును పూజించి, దాని కిందే కూర్చొని పనస ఆకుల విస్తర్లల్లో భోజనం చేయాలి. కార్తీకమాసం ఆధ్యాత్మిక సాధనకు అత్యంత పవిత్రమైనది. మహిమాన్వితమైనది. ఈ రోజు నుండి సూర్యోదయాత్పూర్వమే నదీస్నానం చేయడం శ్రేష్ఠం. నది లభ్యం కాకపొతే లభ్యమైన జలాలతోనే స్నానం చేయాలి. ఋతుపరివర్తనాల వల్ల వాతావరణం లో వచ్చే మార్పులను దృష్టి లో ఉంచుకొని, శారీరిక - మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యాలకు వాటికి ఉన్న సంబంధాన్ని వైజ్ఞానిక దృష్టి తో అర్ధం చేసుకోవాలి.

ఆధ్యాత్మిక ప్రాముఖ్యం గల మాసాల్లో కార్తీక మాసం ఒకటి. ఈ నెల లో నదులు, చెరువులు, బావుల్లో నీరు తేటపడి సూర్యరశ్మి ప్రసారం వల్ల అపూర్వ తెజస్సునూ, బలాన్ని తెచ్చుకొంటాయి.అందుకనే ఇళ్ళలో స్నానాలు వద్దన్నారు. దైవ పూజకు అవసరమైన పుష్ప సమృద్దిని ప్రకృతి ప్రసాదిస్తుంది. అందుకనే సాధన ఈ మాసం అత్యుత్తమం.

ఈ మాసం లో శరదృతువు పవిత్రజలం హంసోదకం గా పిలవబడుతుంది. శరదృతువులో నదీ ప్రవాహం లో ఓషధుల సారం ఉంటుంది. అగస్త్య నక్షత్రం ఉదయించడంవల్ల దోషరహితమైనట్టి శరదృతువు లోని పవిత్ర జలాన్ని "హంసోదకం " అంటారు. ఇటువంటి నీరు స్నానపానాదులకు అమృత తుల్యం గా ఉంటుంది అని చెప్పబడింది.

మానసిక శారీరిక రుగ్మతుల్ని తొలగించి ఆయుషు, ఆరోగ్యాన్ని ప్రసాదించే ఉషోదయ స్నానం కార్తీకం లో ప్రముఖ స్థానం పొందింది. పైత్య ప్రకోపాల్ని తగ్గించేందుకు ఈ హంసోదక స్నానం ఆచరించాలి. చీకటి ఉండగానే ఉషః కాల సమయం లో సుమారు పదిహేను నిమిషాల కాలం ఉదర భాగం మునుగునట్లుగా నదిలో స్నానం ఆచరిస్తే ఉదర సంబంధమైన వ్యాధులు సులభం గా నయమవుతాయి. కార్తీక మాసం లో గృహం లోనూ , తులసి కోట ముందు, దేవాలయం లోనూ, దీపం వెలిగించే వారికి అఖండైస్వర్య ప్రాప్తి కలుగుతుందని శాస్త్ర వచనం.

Download our Mobile App

To stay connected with us, download our mobile Apps..

  • Download
  • Download