ద్వాదశ రాశుల వారికి వృషభ రాశి లో రాహువు, వృశ్చిక రాశి లో కేతు గ్రహ సంచారం వలన కలిగే శుభాశుభఫలితాలు.

ద్వాదశ రాశుల వారికి వృషభ రాశి లో రాహువు, వృశ్చిక రాశి లో కేతు గ్రహ సంచారం వలన కలిగే శుభాశుభఫలితాలు.

 

ద్వాదశ రాశుల వారికి వృషభ రాశి లో రాహువు, వృశ్చిక రాశి లో కేతు గ్రహ సంచారం వలన కలిగే శుభాశుభఫలితాలు.

23 సెప్టెంబర్ 2020 నుండి వృషభరాశి లో రాహువు, వృశ్చిక రాశి లో కేతు గ్రహాల సంచారం ద్వాదశ రాశుల వారికి 18 నెలలు గోచారరీత్యా ఏ విధం గా ఉంటుంది మరియు పాటించాల్సిన పరిహారాలు.

మేషం

కుటుంబ సభ్యుల నుండి దగ్గర వ్యక్తుల నుండి కానీ ఎక్కువ సహాయ సహకారాలు ఆశించకపోవడం మంచిది.

నోటి దురుసుతనం వలన మరిన్ని సమస్యలు ఎదురుకావచ్చు కావున ఎదుటి వారి తో మాట్లాడేటప్పుడు జాగ్రత్త గా వ్యవహరించాలి.

ఖర్చులు అధికమవుతాయి

ఈ సమయం లో నూతన పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు

వృత్తిపరంగా ముందుకు వెళ్ళడానికి శ్రమించాల్సి ఉంటుంది.

జనవరి నుండి జూన్ వరకు అన్ని విధాలా కొంత అప్రమత్త తో మెలగడం మంచిది.

వృషభం

చిన్న చిన్న విషయాలకి కూడా చిరాకు అసహనం ప్రదర్శిస్తారు. దీని వలన మానసిక శాంతి కోల్పోతారు.

శ్రద్ద మరియు నూతన విధానాల ద్వారా వృత్తిపరంగా అభివృద్ధి సాధిస్తారు.

వైవాహిక జీవితం లో మొండి ప్రవర్తన వలన సమస్యలు చికాకులు తలెత్తుతాయి. బేదాభిప్రాయాలు కి అవకాశం కలదు

వీలైనంత వరకు మీ చుట్టు ఉన్నవారి తో సత్సంబంధాలను ఏర్పరచుకోవడం మంచిది.

ఆధ్యాత్మిక భావాలను వృద్ధి చేసుకొంటే కొంత మానసిక బలం చేకూరుతుంది.

ఆర్ధిక విషయాల లో జాగ్రత్త వహించాలి.

జనవరి నుండి మే వరకు కొంత జాగ్రత్త గా మెలగాలి.

 

మిథునం

చాలా కష్టపడితే కానీ పనులు జరగవు. అదికూడా ఊహించిన ఫలితాలు అందుకోవడం కష్టమే.

వృత్తిరీత్యా ఒడిదుడుకులు ఎదురుకోవలసిన వస్తుంది.

ఖర్చులు పెరగడం తో డబ్బుకు ఎప్పుడు కొదవగా ఉంటుంది.

కొన్ని సందర్భాలలో మీ తప్పు లేకపోయినా అపవాదులు ఎదురుకోవలసి వస్తుంది.

చికాకుల వలన శారీరిక అలసట మానసిక అశాంతి ఏర్పడుతుంది

విదేశాలకు వెళ్ళే అవకాశాలు కలుగుతాయి

అనారోగ్య సమస్యలు ఎదురుకోవలసి వస్తుంది. (ముఖ్యం గా మార్చి ఏప్రిల్ నెలలో)

మీ తోనే ఉంటూ మీ వెనుక సమస్యలు సృష్టించే వారికి దూరం గా ఉండాలి.

విద్యార్థులకు కూడా పెద్దగా యోగ్యమైన కాలం కాదనే చెప్పవచ్చు.

భగవంతుని పై విశ్వాసం ఉంచి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి.

తండ్రితో సమస్యలు ఉంటే పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి.

 

కార్కాటకం

నూతన పెట్టుబడుల వలన long run లో మంచి ఫలితాలు ఉంటాయి

మీ పరిచయాలు, కృషి వలన ఆర్ధికం గా నిలదొక్కుకోవడానికి అవకాశాలు లభిస్తాయి.

సంతానపరమైన చికాకులు ఎదురుకోవలసి ఉంటుంది

తక్కువ సమయం లో ధనార్జన మార్గాల కి దూరం గా ఉండాలి.

స్పెక్కులేషన్స్  కి దూరం గా ఉండాలి.

తండ్రి వైపు నుండి కూడా కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది.

అనవసరమైన ఖర్చులు నియంత్రించుకోవడానికి, ఆగిపోయిన డబ్బు తిరిగి రావడానికి కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

సింహం

ఎంత కష్టపడి పని చేసినా వృత్తిరీత్యా విమర్శలు చికాకులు ఎదురుకోవలసి వస్తుంది.

ముఖ్యం గా మీకు మీ పై అధికారులకు అవగాహన లోపం వలన సమస్యలు ఎదురుకోవలసి ఉంటుంది.

కొన్ని సందర్భాలలో ఉద్యోగ మార్పు కి కూడా ప్రయత్నిస్తారు.

ఎన్ని సమస్యలున్నా నిరుత్సాహపడకుండా మీ శ్రమని నమ్ముకొని ముందుకు వెళ్తే పరిస్థితులు చక్కబడతాయి.

జులై , ఆగష్టు నెలలో ఒత్తిడి అధికం గా ఉంటుంది.

నిద్రలేమి వంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు కలవు.

కుటుంబ వ్యవహారాలకు  ప్రాధాన్యతనివ్వాలి.

ఆర్ధికం గా పెద్ద సమస్యలు లేనప్పటికీ అనవసరమైన ఖర్చులు అదుపు చేయకపోతే చికాకులు మొదలవుతాయి.

కన్య

తండ్రి లేదా కుటుంబం లోని పెద్దవారికి అనారోగ్య సమస్యలు తెలెత్తే అవకాశాలు కలవు.

కొన్ని సందర్భాలలో సమస్యల వలన దైవ భక్తి సన్నగిల్లుతుంది. అసలు దేవుడున్నాడా అనే ధోరణి మొదలవుతుంది.

విద్యార్థులకు పెద్దగా యోగవంతమైన కాలం కాదనే చెప్పవచ్చు.

జనవరి, ఫిబ్రవరి నెలల లో చికాకులు అధికం గా ఉంటాయి.

జులై, ఆగష్టు నెలల లో విదేశీ వ్యవహారాలకు అవకాశం కాలదు.

కొత్త పనులు తలపెట్టకపోవడం మంచిది.

తొందరపాటు నిర్ణయాల వలన ఆర్ధిక సమస్యలు తలెత్తుతాయి.

సంతానం యొక్క భవిష్యత్తు కి సంబందించిన ఆలోచనలు అధికమవుతాయి.

 

తుల

మీ మాటలకి విలువ ఉండదు.

కావలసిన వారి నుండే వ్యతిరేకత ఎదురవుతుంది.

శారీరిక దెబ్బలకు అవకాశం కలదు.

road లో నడుస్తున్నా, వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్త తో ఉండాలి.

ఆర్ధికం గా ఒడిదుడుకులు ఉంటాయి.

ఎంతో శ్రమిస్తే కానీ ఆర్ధిక వ్యవహారాలు చక్కబెట్టలేరు.

ఖర్చులు అదుపు చేయలేక పోతారు.

ఇతరుల విషయాలలో అనవసరమైన జోక్యం తగదు.

వైవాహిక జీవితం లో సమస్యలు తలెత్తే అవకాశం కలదు.

లేని పోనీ ఊహలు, అపోహలు మొదలవుతాయి.

పరిస్థితులు మిమ్మల్ని పక్క దోవ పట్టించే అవకాశాలు ఎక్కువ గా ఉన్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో ను నీతి  న్యాయం తప్పకుండా ఉండగలిగితే మంచి జరుగుతుంది.

 

వృశ్చికం

భాగస్వామ్య వ్యాపారాలలో కొన్ని సమస్యలు అపార్థాలకు అవకాశం కలదు

ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని సందర్భాలు ఏర్పడతాయి.

ముఖ్యం గా పైకి మంచి మాటలు చెపుతూ లోపల ఇతర ఉద్దేశ్యాలతో ఉన్నటువంటి వారు మీ చుట్టూ ఉన్నారని గ్రహించి వారికి దూరం గా ఉండడం మంచిది.

జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి.

మీ ప్రత్యర్థులు సమస్యలు సృష్టించడానికే ప్రయత్నిస్తుంటారు.

ఖర్చులు విపరీతం గా పెరుగుతాయి.

విదేశీ వ్యవహారాలు కలసి వస్తాయి.

కష్టపడే తత్వం, పని పట్ల శ్రద్ద వలన శుభ ఫలితాలు కలుగుతాయి. చక్కటి గుర్తింపు కూడా లభిస్తుంది.

మే, జూన్ లో జాగ్రత్త వహించాలి.

 

ధనుస్సు

సమస్యలు ఎదురయినా అధిగమించి ముందుకు వెళ్తారు. ముఖ్యం గా వృత్తిరీత్యా

మీ ప్రత్యర్థులు సమస్యలు సృష్టించి మిమ్మల్ని దెబ్బతీయడానికి వారి శాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ ఎటువంటి పరిస్థితినైనా క్రుంగిపోకుండా ధైర్యం గా ఎదురుకొంటారు.

పెద్ద వారి తో పరిచయాలు ఉన్నతాధికారు సహాయ సహకారాలు లభిస్తాయి.

ఆరోగ్యం మెరుగుపడుతుంది.

జూన్,జులై లో జాగ్రత్తగా ఉండాలి

పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది.

అందరిని గుడ్డిగా నమ్మకూడదు.

అధిక ఖర్చుల వలన టెన్షన్ పడతారు.

లీగల్ వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

 

మకరం

మీ ప్రవర్తన అందరిని ఆకట్టుకొంటుంది.

ఎటువంటి సమస్య ఎదురైనా చాకచక్యం గా వ్యవహరించి ముందడుగు వేస్తారు.

మీ creativity ని positive side వినియోగిస్తే చక్కటి ఫలితాలు కలుగుతాయి.

సంతాన విషయం లో చికాకులు ఎదురుకోవలసి ఉంటుంది.

కొన్ని సందర్భాలలో వాగ్వివాదాలకు కూడా అవకాశం కలదు.

సంతానం యొక్క ఆరోగ్య విషయం లో కూడా శ్రద్ద వహించాల్సి ఉంటుంది.

గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

తొందరగా డబ్బు సంపాదించే schemes, speculations వంటి వాటికి దూరం గా ఉండాలి.

ముఖ్యం గా మోసపూరీత వ్యవహారాలకి దూరం గా ఉండాలి.

సంబంధబాంధవ్యాలు దెబ్బతినే అవకాశం ఉంది.

మనవారే కదా అని అందరితో అన్నీ పంచుకోవడం మంచిది కాదు, దీని వలన సమస్యలు ఎదురుకోవలసి ఉంటుంది.

విద్యార్థులకి అనుకూల సమయం కాదు.

 

కుంభం 

చిన్న చిన్న విషయాలకి కూడా సహనం కోల్పోతారు. మనశాంతి లోపిస్తుంది.

కుటుంబ వ్యవహారాలు కూడా మీరు అనుకొన్న విధంగా ముందుకు సాగవు.

మూడవ వ్యక్తి ప్రమేయం వలన వైవాహిక జీవితం లో సమస్యలు కి అవకాశం కలదు.

ఆస్తికి సంబంధించి మరియు వాహనాలకు సంబందించిన వ్యవహారాల లో జాగ్రత్త వహించాలి.

దెబ్బలు తగలడానికి అవకాశం కలదు.

తల్లి యొక్క ఆరోగ్య విషయం లో జాగ్రత్త వహించాలి.

వృత్తి కి సంబందించిన వ్య్వక్తుల తో సంబంధబాంధవ్యాలు దెబ్బతినే అవకాశం కలదు.

విద్యార్థుల ఆరోగ్య విషయం లో శ్రద్ద వహించాలి.

 

మీనం

communication మరియు media రంగం లోని వారికి చక్కటి అవకాశాలు లభిస్తాయి.

short trips కి అవకాశం కలదు.

వ్యక్తిగతం గా మరియు వృత్తిపరంగా జాగ్రత్త వహించాలి.

ఉన్నత స్థితి కి చేరుకోవడానికి తగిన అవకాశాలు లభిస్తాయి.

ఆర్ధిక పరిస్థితి మెరుగుపరుచుకోవడానికి చక్కటి ప్రణాళికల తో ముందుకు వెళ్తారు.

జీవితభాగస్వామి ఆరోగ్య విషయం లో జాగ్రత్త వహించాలి.

చిన్న చిన్న accidents వంటి వాటికి అవకాశం కలదు.

ఖర్చులు పెరుగుతాయి.

ఏదైనా నిర్ణయం తీసుకోవలసి వస్తే ఎటు తేల్చుకోలేక సమయం వృధా చేస్తారు.

 

ద్వాదశ రాశుల వారు ఆచరించవలసిన పరిహారాలు

రాహుగ్రహ అనుకూలత కొరకు దుర్గ అమ్మవారిని కేతు గ్రహ అనుకూలత కొరకు గణపతి ని ప్రతి నిత్యం శక్త్యానుసారం పూజించడం మంచిది.

శ్రీ కాళహస్తి వంటి పుణ్య క్షేత్రాలలో రాహు కేతు పూజ ఒకసారి చేయించడం మంచిది.

 

 

 

Download our Mobile App

To stay connected with us, download our mobile Apps..

  • Download
  • Download