విజయదశమి పండుగ యొక్క ప్రాముఖ్యత

విజయదశమి పండుగ యొక్క ప్రాముఖ్యత

విజయదశమి పండుగ యొక్క ప్రాముఖ్యత 

నవ రాత్రి పదం లో నవ శబ్దం తొమ్మిది సంఖ్యను సూచిస్తుంది. నవరాత్రులను నవ అహోరాత్రాలు అని ధార్మిక గ్రంధాలు వివరిస్తున్నాయి. అంటే తొమ్మిది పగళ్ళు, తొమ్మిది రాత్రులు నిర్వర్తించే దేవి పూజకు ఒక ప్రత్యక విధానం ఉంది. ఆశ్వయుజ శుక్ల పక్ష పాడ్యమి తిథి నుండి పూర్ణిమ వరకు తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్ళు అమ్మవారిని ని పూజించడం ప్రశస్తం గా చెప్పబడింది. దీనినే 'శరన్నవరాత్రులు' లేదా 'దేవి నవరాత్రులు అంటారు'.

 నవ రాత్రి వాస్తవానికి ఋతువుల సంధికాలం, అందుచేత సృష్టికి కారణమైన మహామాయ తీవ్రవేగం కలిగి ఉంటుంది. పూజాదుల చేత ఆమెను ఆహ్వానించటం సులభ సాధ్యం. తొమ్మిది రోజులు నవ దుర్గలను నిష్ఠ గా ఉపాసించే ఆరాధకులకు దేవి అనుగ్రహం లభిస్తుంది. నవ రాత్రులో రాహుకాల వేళ రాహుకాల దీపం వెలిగించాలి. రాహు  ప్రతికూల ప్రభావం తగ్గి, దోష నివారణ జరుగుతుంది. దేవి అర్చనలో లలితా సహస్రనామాలు, దుర్గాసప్తశతి పారాయణ చేసే భక్తుల కోరికలు నెరవేరుతాయి. రోగ పీడలతో బాధపడే వారు, జాతకం లో అపమృత్యు దోషం ఉన్న వారు ఈ తొమ్మిది రోజులు నియమం తప్పకుండా దేవి ఆరాధన చేయడం శుభకరం.

సరస్వతి పూజ - నవ రాత్రుల్లో మూలా నక్షత్రం ఉన్న రోజున సరస్వతి దేవిని పూజించాలి. అమ్మ వారికి నైవేద్యం గా తెల్లని కుడుములు సమర్పించాలి. విద్య రూపం లో జ్ఞానం ప్రసాదించే సరస్వతి దేవి అనుగ్రహం కొరకు, లౌకిక వ్యవహారాల్లో విజయం సాధించడం కొరకు. సరస్వతి దేవి ని పూజించడం వలన ప్రాప్తిస్తాయి. సదా ఆమె కృపాకటాక్షాల వలన జ్ఞానం కలిగి అన్నింటా విజయం లబిస్తుంది.

దుర్గాష్టమి - కాల చక్రం లో ఆశ్వయుజ మాసం లో ప్రకృతి నిస్తేజంగా నిద్రాణ స్థితి లో ఉండటం వల్ల ఆరోగ్య ప్రాణ హాని కలిగించే అనేక దుష్ట శక్తులు విజృంబిస్తుంటాయి. శరత్ వసంత అనే ఇద్దరు రాక్షసులు వివిధ రోగాలకు కారకులు. ఈ ఋతు పరివర్తన సమయం లో జ్వరాలు, విష జ్వరాలు, కఫం దగ్గు మొదలైన ఉపద్రవాలను నివారించటానికి అనాదిగా దుర్గా పూజా విధానం ఆచరణలో ఉంది దేవి మహా గౌరిగా దర్శనమిచ్చే రోజు. ఈ అష్టమికే మరో పేరు కాలికాష్టమి దుర్గా అష్టోత్తరం, సహస్ర నామాలు చదువుతూ అమ్మవారి ని పూజించాలి. దేవికి దానిమ్మ పండ్లు, పొంగలి , పులిహోర నివేదన చేయాలి. కుజ గ్రహ దోష జాతకులు దుర్గాష్టమి రోజున అమ్మవారిని పూజించడం చక్కటి పరిహారం గా చెప్పవచ్చు.

మహర్నవమి - నవరాత్రులలో ప్రధానమైన రోజు దేవి మహిషుడిని సంహరించిన రోజు. మహిషాసుర మర్దిని రూపం లో  మహా శక్తి స్వరూపిణిగా దర్శనమిస్తుంది. లలితా సహస్రనామాలు పఠిస్తూ అమ్మవారికి కుంకుమార్చన చేయాలి. ఎరుపురంగు పూలు, జమ్మి పూలు, కనకాంబరాల తో పూజించి పొంగలి,పులిహోర, అరటి పండ్లు నివేదించడం మంచిది.

విజయ దశమి - ఆశ్వయుజమాసం శుక్లపక్షం లో వచ్చే దశమి తిథి రోజున, సాయంకాలం నక్షత్రాలు ఉదయించే వేళ విజయ కాలం. సమస్తమైన కోరికలను తీర్చే ఆ కాలం పేరు మీదుగానే దశమి కి 'విజయదశమి' అని పేరు వచ్చింది.  సాధారణం గా విజయదశమి నాడు శ్రవణ నక్షత్రం ఉంటుంది. నక్షత్ర మండలం లో శ్రవణ నక్షత్రం చెవి ఆకారం లో ఉంటుంది అందుకే ఈ రోజు ఏదైనా కొత్త విద్యలు నేర్చుకోవాలనుకొనేవారు ఈ రోజు ప్రారంబిస్తే విశేషం గా లాభిస్తుంది.

శమీచెట్టు యొక్క పూజ ఈ రోజు విశేషం గా లాభిస్తుంది. జమ్మి చెట్టును పూజించడం లక్ష్మీప్రదమని పురాణాలు చెబుతున్నాయి. శమీ వృక్షం సువర్ణ వర్షం కురిపిస్తుందని శాస్త్రాల్లో ఉంది. విజయ దశమి రోజున పూజలు అందుకొన్న జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజాస్థలం లో, ధన స్థానం లో నగదు పెట్టెల్లో ఉంచుతారు. దీనివల్ల ధనవృద్ది జరుగుతుంది. పరమ శివునికి జగన్మాత దుర్గా దేవికి, సిద్ది ప్రదాత గణపతి కి శమీ పత్రి సమర్పించే ఆచారం అనాదిగా వస్తోంది. పూర్వం జమ్మి చెట్టు కాడల రాపిడి ద్వారా సృష్టించిన అగ్నితోనే యజ్ఞ యాగాదుల క్రతువులు నిర్వహించేవారు.  ఇవాల్టికి దేశం లోని వివిధ ప్రాంతాల్లో శమీ వృక్షం లో అగ్ని ఉంటుందనే విశ్వాసం దృడపడింది. అగ్ని వీర్యమే సువర్ణం కనుక జమ్మి బంగారం కురిపించే చెట్టుగా పూజార్హత పొందింది. ఈ రోజే శ్రీ రాముడు రావణుని పై విజయం సాధించాడు. విజయదశమి రోజునే శమీ పూజ కుడా నిర్వహిస్తారు. శ్రీ రాముని వనవాస సమయం లో కుటీరం జమ్మి చెట్టు చేక్కతోనే నిర్మించారని చెబుతారు. శమి అంటే పాపాల్ని, శత్రువుల్ని నశింపజేసేది. పంచ పాండవులు అజ్ఞాత వాసం కి వెళ్ళే ముందు తమ ఆయుధాలని  శమీ చెట్టు పై పెట్టడం జరిగింది.

 

 

 

p100

 

 

 

Download our Mobile App

To stay connected with us, download our mobile Apps..

  • Download
  • Download