అట్లతదియ విశిష్ఠత

అట్లతదియ విశిష్ఠత

అట్లతదియ విశిష్ఠత

ప్రతి సంవత్సరం ఆశ్వయుజ బహుళ తదియనాడు స్త్రీలంతా ఆనందోత్సవాలతో అట్లతద్ది జరుపుకుంటారు.  ఇది పూర్తిగా ఆడవారు భక్తి శ్రద్దలతో చేసుకొనే పండుగ గా చెప్పవచ్చు. అట్లతద్ది స్త్రీలకూ ఎంతో శుభప్రదమైనది. పిల్లలు, పెద్దలు, అందరికీ ప్రమోదాన్ని కలిగించే పర్వదినం.

ఈరోజున తెల్లవారు ఝామున మేల్కొని గౌరీదేవి పూజ చేయాలి. చంద్రదర్శనం అనంతరం తిరిగి గౌరీపూజ చేసి, ఆమెకు పది అట్లు నైవేద్యంగా పెట్టాలి. తర్వాత ముత్తయిదువులకు అలంకారం చేసి అట్లు, ఫలాలు వాయనంగా ఇవ్వాలి. అట్లతద్ది నోము కథ చెప్పుకొని, అక్షింతలు వేసుకోవాలి. అనంతరం భోజనం చేయాలి. పదిరకాల ఫలాలను తినడం, పదిమార్లు తాంబూలం వేసుకోవడం, పదిమార్లు ఊయల ఊగడం, ఈ పండుగలో విశేషం.

ఈవిధంగా వాయనం ఇచ్చుకుంటే గౌరీదేవి అనుగ్రహంతో పెళ్ళికాని అమ్మాయిలకు గుణవంతుడైన, చక్కటి రూపం కలిగిన భర్త లభిస్తాడని, పిల్లలు కలుగుతారని, ఐదవతనంతో పాటు పుణ్యం లభిస్తుందని తర తరాల నుంచి వస్తున్న నమ్మకం.

అట్ల తద్దె పేరులోని అట్ల యొక్క ప్రాముఖ్యత విశిష్టం గా చెప్పబడింది. ఈ పండుగలో అమ్మవారికి అట్లని నైవేద్యంగా పెట్టడంలో ఓ అంతరార్థం వుంది. నవగ్రహాల లోని కుజుడు అట్ల ప్రియుడు. అట్లను గౌరీ దేవి కి నైవేద్యం గా నివేదించితే కుజగ్రహ శాంతి జరిగి దోష పరిహారం అవ్వడమే గాక వైవాహిక జీవితం లో ఎటువంటి అడ్డంకులు రావు. కుజుడు రజోదయమునాకు కూడా కారకుడు కావున స్త్రీలకు ఋతుచక్రమునకు సంబందించిన సమస్యలు రానివ్వకుండా కాపాడుతుంది. తద్వారా గర్భాదారణము లో ఎటువంటి సమస్యలు ఉండవు. ఇందులో ప్రధానం గా వాడే మినుములు రాహు గ్రహానికి, బియ్యం చంద్ర గ్రహానికి సంబందించిన ధాన్యాలు, వీటి తో చేసిన అట్లను వాయనం ఇవ్వడం వలన గర్భ దోషాలు తొలగిపోతాయి. అంతే కాదు గర్భస్రావం నివారింపబడి సుఖ ప్రసవం అవుతుందని చెప్పబడింది.

ఈ పండుగ లో మరో విశేషం ఆడవారంతా గోరింటాకు పెట్టుకోవడం. చేయడం లోని పరమార్దం, శరీరం చల్లబడి వివిద  రకాల క్రిముల వలన కలిగే సమస్యల నుండి గోర్లని, అరచేతుల్ని, అరికాళ్ళని  కాపాడుకోవడం కొరకు ఆచరిస్తాం .

Download our Mobile App

To stay connected with us, download our mobile Apps..

  • Download
  • Download