పుష్కరాల యొక్క ప్రాశస్త్యం

పుష్కరాల యొక్క ప్రాశస్త్యం

 

 

పుష్కరాల యొక్క ప్రాశస్త్యం

జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి పుష్కరం అంటే పన్నెండేళ్ళ కాలం. దేవ గురువైనటువంటి గురువు ఒకొక్క రాశి లో ఒకొక్క సంవత్సరం చొప్పున సంచరిస్తూ ఉన్నప్పుడు ఆయా రాశులకు సంబందించిన నదికి పుష్కర కాలమవుతుంది. అంటే గురువు మకర రాశిలో ప్రవేశించినప్పుడు తుంగభద్ర నదికి పుష్కరాలు వస్తాయి. ఈ సమయంలో ఆయా నదులకు దైవిక శక్తులు ఉంటాయి.

పుష్కర కాలం లో నదులలో త్రిమూర్తులు, ఇంద్రాది  దేవతలు, పితృ దేవతలు, ఋషులు నివసిస్తారు. మూడున్నర కోట్ల తీర్థములు కలుస్తాయి. అందుకే పుష్కర స్నానం అనంత పుణ్యప్రదం. పుష్కరాలలో స్నానమాచరించిన వారికి పన్నెండు సంవత్సరాలపాటు ఆ నదులలో నిత్యం స్నానం చేసినంత పుణ్యం ఫలం లభిస్తుంది. పుష్కర స్నానం ఒకసారి చేస్తే పన్నెండు సంవత్సరాల కాలం పన్నెండు పుణ్య నదులలో స్నానం చేసిన పుణ్యం లభిస్తుందని, జన్మ జన్మల పాపాలు నశించి, మోక్షప్రాప్తి కలుగుతుంది. అశ్వమేధ యాగం చేసిన పుణ్యం ప్రాప్తిస్తుంది ఋషి వచనం.

అందుకే ఈ పవిత్ర పుష్కర సమయం లో చేసే స్నానం, దానం, జపం, అర్చన, ధ్యానం, హోమం, తర్పణాది అనుష్ఠానాలకు, పిండప్రదానాలకి అక్షయమైన  పుణ్యం లభిస్తుంది, అలాగే నాదీ పుష్కరాలలో పూజలు నిర్వహించిన వారికి దీర్ఘాయువు లభిస్తుందని  శాస్త్ర వచనం. పుష్కర సమయం లో చేసే సత్కర్మల వలన శారీరిక, మానసిక మలినాలు తొలగి పవిత్రత చేకూరుతుంది. తర్పణాలు వదలడం, శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానాలు చేయడం వలన పితృ దేవతల యొక్క ఆశీస్సులు విశేషం గా లభిస్తాయని ప్రతీతి.

 

ఈ సమయం లో బంగారం , వెండి, గోవులు, ధాన్యం, ఉప్పు, పండ్లు, బెల్లం, వస్త్రాలు, నూనె, శాకములు, తేనే, పీట, అన్నం, పుస్తకాలు వారి వారి శాక్తానుసారం దానం చెయ్యడం వలన సుఖ సంతోషాలతో పాటు ముక్తి కలుగుతుందని ఋషి ప్రమాణం.

ఈ పుష్కర పన్నెండు రోజులు శాస్త్రానుసారం చేయదగిన దానాలు

మొదటి రోజు - బంగారం, వెండి, ధాన్యము, భూమి

రెండవ రోజు - వస్త్రాలు, ఉప్పు, రత్నాలు

మూడవ రోజు - బెల్లం, పండ్లు, అశ్వశాఖ

నాలగవ రోజు - నెయ్యి, నూనె, పాలు, తేనే

అయిదవ రోజు - ధాన్యం, శకటం , వృషభం, హలం

ఆరవ రోజు - ఔషధాలు , కర్పూరం, చందనం, కస్తూరి

ఏడవరోజు- గృహం, పీట, శయ్య

ఎనిమిదవ రోజు - చందనం, కందమూలాలు , పువ్వులు

తొమ్మిదవ రోజు - కంబళి

పడవ రోజు - కూరగాయలు, సాలగ్రామం, పుస్తకాలు

పండకొండవ రోజు - గజ దానం

పన్నెండవ రోజు - నువ్వులు

Download our Mobile App

To stay connected with us, download our mobile Apps..

  • Download
  • Download