పోలి స్వర్గం విశిష్ఠత

పోలి స్వర్గం విశిష్ఠత

 

పోలి  స్వర్గం

మార్గశిర  శుద్ధ పాడ్యమి నాడు తెల్లవారు ఝామున దీపాలు వదిలే పర్వం పోలి స్వర్గ దీపం అంటారు. పురాణగాధ  ఆధారం గా పూర్వం కృష్ణ నది తీరం లో పోలమ్మ అనే మహిళ అత్తవారింట కష్టాల కారణం గా కార్తీక మాసం లో నదీ స్నానాలకు నోచుకోలేదు, అయినా భగవంతుని పైన శ్రద్దా భక్తులతో ఇంటివద్దనే సూర్యోదయానికి ముందే స్నానమాచరించి , మజ్జిగ చిలికే కవ్వాని కి అంటిన వెన్నని కరిగించి కార్తీక మాసమంతా నిష్ఠ గా దీపారాధన చేసేది. అచంచలమైన భక్తి విశ్వాసాలకు మెచ్చి వైకుంఠం నుండి విమానమొచ్చి పోలమ్మను సశరీరంగా వైకుంఠానికి తీసుకొని వెళ్ళిందని పురాణాల ద్వారా తెలుస్తుంది.

 ఈ కథ ద్వారా భగవంతునికి కావలసింది నిర్మలమైన భక్తి శ్రద్ధలు మాత్రామేనని, వారి వారి శాక్తానుసారం భగవంతుణ్ణి ఆరాధిస్తే భగవంతుడు ప్రసన్నుడై ఎల్ల వేళలా సంరక్షిస్తాడని తెలిపే కథనే పోలి స్వర్గ దీపం అంటారు.

కార్తీక మాసమంతా వ్రత దీక్షగా దీపాలు వెలిగించి మరియు కార్తీక స్నానాలు  ఆచరించిన వారు మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు తెల్లవారు ఝామున ఉద్యోపన చేసుకోవాలి. అరటి దొప్పలో దీపాలు వెలిగించి నదిలో వదిలిపెట్టాలి, తర్వాత కార్తీక మాసం లో సూర్యోదయానికి ముందే నదీ స్నానం , దీపారాధన చేసిన ఫలితాన్ని తెలియ చెప్పే పోలి  యొక్క కథను చెప్పుకొని  అక్షింతలు వేసుకొంటే మోక్షం కలుగుతుందని ప్రతీతి.

అంతే కాకుండా, కార్తీక మాసం లో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా కూడా ఈ రోజున 30 వత్తులను వెలిగిస్తే మాసమంతా దీపారాధన చేసిన ఫలితం ప్రాప్తిస్తుందని చెప్తారు. ఈ రోజన బ్రాహ్మణులకు తమ శక్తి కొద్దీ దీప దానం మరియు స్వయంపాకం దానం చేయడం పుణ్యప్రదం గా చెప్పబడింది.

Download our Mobile App

To stay connected with us, download our mobile Apps..

  • Download
  • Download