అంగారక చతుర్థి ప్రాముఖ్యత

అంగారక చతుర్థి ప్రాముఖ్యత

 

 

గణపతి కి అత్యంత ప్రియమైన తిథులలో ముఖ్యమైనది చవితి తిథి. ఈ చవితి తిథి ని రెండు రకాలుగా ఆచరిస్తారు మొదటిది వరద చతుర్థి , రెండవది సంకటహర చతుర్థి. అమావాస్య తరువాత వచ్చే చతుర్థి రోజున  వరద చతుర్థి  ఆచరిస్తారు.  పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజున సంకటహర చతుర్థి ఆచరిస్తారు. ఇందులో వరద చతుర్థి ని గణపతి వ్రతం గా వినాయక చవితి రోజున ఆచరిస్తారు. సంకటములను తొలగించే సంకట హర చతుర్థి వ్రతం ను మాత్రం  ప్రతి నెల ఆచరిస్తూ ఉంటారు. ఒక వేళ సంకటహర చతుర్థి మంగళవారం కానీ వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు. అలా కలసి రావడం చాలా విశేషమైన పర్వదినం గా చెప్పబడింది.

ఈ అంగారక చతుర్థి నాడు సంకట హర చతుర్థి వ్రతం ఆచరించడం వలన జాతకములో కుజ గ్రహ దోషాలు, కుజ గ్రహం వలన కలుగుతున్న సమస్యలు ఉపశమించబడతాయి. అలాగే చేస్తున్న పనులలో కలుగుతున్న ఆటంకాలు తొలగి పనులు విజయవంతమవుతాయి.

Download our Mobile App

To stay connected with us, download our mobile Apps..

  • Download
  • Download