శుభకృత్ నామ నవనాయక ఫలాలు

శుభకృత్ నామ నవనాయక ఫలాలు

నవనాయక ఫలాలు.

రాజు – శని - రాజు శనీశ్వరుడు కావడం వల్ల ప్రజలు చోరాగ్ని బాధలు, ఆరోగ్య సమస్యలతో ఇబ్బందిపడతారు. పంటలకు కొంత నష్టం, ప్రభుత్వ చట్టాలు అర్థం కాక ప్రజలు అయోమయానికి లోనవుతారు. మోసకారితనం అధికమవుతుంది. అయితే తక్కువ కాలం పండే పంటలు ఫలిస్తాయి.

మంత్రి – గురువు - దేవగురువు మంత్రి కావడం వల్ల దేశం సుభిక్షంగా, పాడిపంటలతో విలసిల్లుతుంది. పాలన సవ్యమార్గంలో నడుస్తుంది. అధికారగణంతో ప్రభుత్వాలకు సమన్వయం పెరుగుతుంది.

 

సేనాధిపతి – బుధుడు - వాయువులతో కూడిన వర్షాలు సమృద్ధిగా ఉంటాయి. ప్రజాసౌఖ్యం. పంటలు సంపూర్ణంగా పండుతాయి. అయితే సైనిక హడావుడి అధికంగా ఉంటుంది.

 

అర్ఘ్యాధిపతి – బుధుడు - వర్షాలు అధికంగా ఉంటాయి. అలాగే, వివిధ వస్తువుల ధరలు పెరుగుతాయి.  పుప్పుదినుసులు, ఎరువుల ధరల పెరుగుదల ఇబ్బందికరంగా మారవచ్చు.

 

మేఘాధిపతి – బుధుడు - మధ్యభారతంలో వర్షాలు అధికంగా ఉంటాయి. అలాగే, తూర్పుతీరంలో తుఫాన్లు, గాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయి.

 

పూర్వసస్యాధిపతి – రవి - సూర్యుడు సస్యాధిపతి కావడం వల్ల యవలు, గోధుమలు, ఉలవలు, సెనగ పంటలు అధికంగా పండుతాయి. రైతులకు సరైన గిట్టుబాటు ధరలు కూడా లభిస్తాయి.

అపర సస్యాధిపతి – శుక్రుడు - ప్రజలు ఎటువంటి రోగాలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. అన్ని పంటల ఉత్పత్తులు అనుకూలిస్తాయి. అతివృష్టి పరిస్థితులు నెలకొన్నా సుభిక్షంగానే ఉంటుంది.

రసాధిపతి – కుజుడు - రసద్రవ్యములకు కుజుడు అధిపతి కావడం వల్ల నెయ్యి, నూనెలు, బెల్లం,వెండి, ఉప్పు వంటి వస్తువుల ధరలు తగ్గుతాయి.

నీరసాధిపతి – శని - వివిధ లోహాలతో చేసిన వస్తువుల ధరలు తగ్గి ప్రజలకు అందుబాటులో ఉంటాయి. అయితే బంగారం, రత్నాలు, వెండి, ముత్యాలు వంటి ధరలు అధికం కావడంతో ప్రజలు ఇబ్బందిపడతారు. ఇనుము, నూనెల ఉత్పత్తులు అధికమవుతాయి.

 

 

Download our Mobile App

To stay connected with us, download our mobile Apps..

  • Download
  • Download