చైత్ర పౌర్ణమి విశిష్ఠత

చైత్ర పౌర్ణమి విశిష్ఠత

చైత్ర పౌర్ణమి విశిష్ఠత

చైత్ర మాసం శుక్ల పక్ష పౌర్ణమి తిథిని చైత్ర పౌర్ణమి అంటారు. పురాణాల ఆధారం గా చైత్ర పౌర్ణమి రోజు శ్రీ మహావిష్ణువు ని విధి విధానాలతో పూజించడం వలన ఆయన అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు చంద్రుణ్ణి పూజించి వ్రతం ఆచరిస్తారు. దీని వలన జాతకరీత్యా చంద్ర గ్రహ దోషాల వలన సమస్యలు ఎదురుకొంటున్నవారు, మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది. ఈరోజు ముఖ్యం గా  మానవుల యొక్క మంచి చెడులు పాపపుణ్యాలు బేరీజు వేసేటువంటి చిత్ర గుప్తుని ప్రత్యేకం గా పూజించడం వలన పాపలు తొలగుతాయని నమ్మకం.

ఈరోజు అవకాశం ఉన్నవారు నదీ స్నానం ఆచరించడం వలన సర్వ పాపాలు తొలగుతాయి. సర్వ దుఃఖాలను అధిగమించే శక్తి సామర్ధ్యాలు కలుగుతాయి. ఈరోజు స్నానమాచరించే నీటి లో తులసి ఆకులను వేసుకొని స్నానమాచరించడం వలన లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఈరోజు ఆరోగ్యం సహకరించే వారు ఉపవాస దీక్ష చేసి చంద్రునికి అర్ఘ్యం సమర్పించి పరమాన్నాన్నీ నివేదించాలి అకాగే తమ శాక్తానుసారం బ్రాహ్మణునికి తాంబూలం ఇచ్చి సత్కరించాలి. దీని  వలన ఆర్ధిక సమస్యలు తొలగుతాయి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఈరోజు విరిగా బీదవారికి దాన ధర్మాలు చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. భారతదేశం లో చాలా ప్రదేశాలలో హనుమత్ విజయోత్సవ యాత్రగా జరుపుకొంటారు. అలాగే శివ పార్వతుల కళ్యాణం ఆచరించడం కూడా చాలా ప్రదేశాలలో చూడవచ్చు.

Download our Mobile App

To stay connected with us, download our mobile Apps..

  • Download
  • Download