మట్టి తో చేసిన వినాయకుడ్ని ఎందుకు పూజించాలి

మట్టి తో చేసిన వినాయకుడ్ని ఎందుకు పూజించాలి

 

మట్టి తో చేసిన వినాయకుడ్ని ఎందుకు పూజించాలి

హిందూ సంప్రదాయం లో మనం చేసే ప్రతి పనికి చక్కటి ఆధ్యాత్మిక మరియు సామాజిక స్పృహ ఉంటాయి. మన పూర్వీకులు ఏర్పరిచిన ఆచారాలు సంప్రదాయాల లో ఎన్నో  శాస్త్రీయ కోణలు ఎంతో విజ్ఞానం ఇమిడి ఉన్నాయి. ఇటువంటి ఆచారాల్ని మనం గౌరవించి మన జీవనాన్ని సుఖమయం చేసుకోవడం తో పాటు భవిష్యత్తు తరాల ఉన్నతి కి పాటు పడాలి.

వినాయక చవితి మనకు వర్ష ఋతువు లో వస్తుంది. ఎండాకాలం లో చెరువులు, బావులు, కుంటలు ఎండడం వలన నీరు తగ్గుతుంది. ఈ సమయం లో అందులో ఉన్న బురద మట్టి ని బయటకు తీయడం వలన వర్షాలు పడినప్పుడు వాన నీటిని నిలువ చేసుకొనే సామర్థ్యం పెరుగుతుంది.

భగవంతుడు విశ్వవ్యాపిత. విశ్వవ్యాపకత్వము కలిగి ఉన్నది ప్రకృతి స్వరూపమైన మట్టి ఒక్కటే. అందుకే  మట్టి తో వినాయకుడిని చేసి భగవంతుని విశ్వవ్యాపకత్వాని తెలియ చేయడమే. మట్టి నుండే  అన్ని ప్రాణులు  సృష్టింపబడ్డాయి. చివరకు సర్వ జీవులు మట్టిలోనే లయమవుతాయి. ఇదే సృష్టి ధర్మం. మట్టి ఎక్కడైనా ఎవరికైనా లభిస్తుంది . బీద, ధనిక తేడా ఉండదు. భగవంతుడు అందరివాడు. మట్టి అందరికి సులభం గా లభిస్తుంది. అందుకే మట్టి తో వినాయకుడిని చేసి పూజించడం ప్రాధాన్యతను సంతరించుకొంది.

ఇలా పూజించిన విగ్రహాన్ని తిరిగి ఆ చెరువుల్లోని నిమజ్జనం చేస్తారు. ఇలా నిండిన చెరువుల్లో మట్టిని వేయడం వలన బురదగా మారి, చెరువు అడుగు భాగానికి చేరి నీరుని ఇంకకుండా అడ్డుపడుతుంది.

ఇక సామాజిక కోణాన్ని పరిశీలిస్తే అందరు కలిసి మట్టి ని తీయడం, అందరు కలిసి తిరి నిమజ్జనం చేయడం వలన జనుల మధ్య చక్కటి ఐక్యత స్నేహ భావాలు పెరుగుతాయి. ఇలా అందరూ కలిసి చేసే మంచి పనుల వలన పర్యావరణాన్ని కాపాడుకొంటూ, సామాజిక హితం కొరకు కృషి చేస్తూ చక్కటి జీవన శైలిని గడపాలి.

Download our Mobile App

To stay connected with us, download our mobile Apps..

  • Download
  • Download