ఉత్తరాయణ పుణ్య కాలం

ఉత్తరాయణ పుణ్య కాలం

సూర్యుడు మకర రాశి లో ప్రవేశించే పుణ్య ఘడియల్లో ఉత్తరాయణ పుణ్య కాలం ఆరంభం. దేవమార్గం ప్రారంభమయ్యే రోజు. ఈ రోజు చేసే స్నానాలు, దానాలు, జపాలు, వ్రతాలు విశేష ఫలితాలనిస్తాయి. సంక్రాంతి రోజు గుమ్మడి వస్త్రములు దానం చేయడం ఆచారం. విష్ణు సహస్రనామం పఠించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. దేవ పితృ దేవతలనుద్దేసించి  చేసే తర్పణాలు, దానాలు పుణ్యప్రదం. పౌష్య లక్ష్మిగా అమ్మవారి ని ఆరాధించే సమయం. సంక్రాంతి రోజు స్నానం చేయని వారికి రోగాదులు వస్తాయని ధర్మశాస్త్రం ద్వారా తెలుస్తుంది. సంక్రాంతి రోజు దేవతలకు, పితృదేవతలకు, పాత్రులకు ఏ ఏ దానాలు చేస్తామో అవి జన్మజన్మలకి అత్యధికం గా లభిస్తాయని ప్రతీతి. ఈ పుణ్య కాలం లో తిలలు, బియ్యం కలిపి శివారాధన చేయడం,ఆవు నేతి తో అభిషేకం చేయడంనువ్వుల నూనె తో దీపం వెలిగించడం చాలా శ్రేష్ఠమైనది. నల్ల నువ్వులతో పితృతర్పణాలు ముఖ్యం గా ఆచరించవలసిన విధి. సంకరమణం నాడు ఒంటి పూజ భోజనం చేయాలి. దేవతలకు పితృదేవతల పూజలకు పుణ్యకాలం. మంత్ర జపాలు, ధ్యానం, పారాయణం  విశిష్ఠ ఫలితాలని  శీఘ్రంగా ప్రసాదించే కాల మహిమ సంక్రమణానికి ఉంది.

 

Download our Mobile App

To stay connected with us, download our mobile Apps..

  • Download
  • Download