కుంభం
ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు.
నేర్పరితనంతో సమస్యల నుంచి గట్టెక్కుతారు.
శ్రేయోభిలాషుల సూచనలు పాటిస్తారు.
ముఖ్య కార్యక్రమాలలో విజయం సాధిస్తారు.
కుటుంబంలో విశేష గౌరవం పొందుతారు.
క్రీడాకారులకు మంచి గుర్తింపు రాగలదు.
వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సానుకూలమవుతాయి.
అవసరాలకు తగినంతగా సొమ్ము అందుతుంది.
రావలసిన బాకీలు కూడా అందుతాయి.
ఉద్యోగావకాశాలు దక్కి ఉత్సాహంగా గడుపుతారు.
జీవిత భాగస్వామితో వివాదాలు సర్దుబాటు కాగలవు.
పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
విందులువినోద కార్యక్రమాలకు హాజరవుతారు.
ఆరోగ్య విషయంలో మెలకువ అవసరం.
దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి.
విలాసజీవనం సాగిస్తారు.
వ్యాపారులకు లాభాలు మరింత దక్కుతాయి.
ఉద్యోగస్తులకు అనుకూల మార్పులు ఉండవచ్చు.
పారిశ్రామికవేత్తలు, వ్యవసాయదారులకు మరింత అనుకూలం.
వారాంతంలో మానసిక ఆందోళన.
కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు.