వృషభం
కొన్ని వ్యవహారాలలో విజయబావుటా ఎగురవేస్తారు.
పట్టుదలకు మారుపేరుగా నిలుస్తారు.
అలాగే దానధర్మాల పై దృష్టి పెడతారు.
అనుకున్న లక్ష్యాలు, ఆశయాలు సాధిస్తారు.
ఇంతకాలం పడిన కష్టం ఫలితాన్నిచ్చే సమయం.
చేపట్టిన కార్యక్రమాలు కష్టసాధ్యమైనా తొందరపడకుండా పూర్తి చేస్తారు.
ప్రత్యర్థులను ఆకర్షించి మీ తెలివిని చాటుకుంటారు.
ఉద్యోగాన్వేషణలో ఫలితం కనిపిస్తుంది.
కాంట్రాక్టర్లు ఆశించిన టెండర్లు దక్కించుకుంటారు.
ఆధ్యాత్మిక భావాలు పెంచుకుంటారు.
ఆస్తుల వ్యవహారాలలో వివాదాలు పట్టుదలతో పరిష్కరించుకుంటారు.
వృత్తులు, వ్యాపారాలను అత్యంత చాకచక్యంగా నిర్వహించి ముందుకు సాగుతారు.
కళాకారులు, వైద్యులు, పారిశ్రామికవేత్తలకు ఉత్సాహవంతంగా గడుస్తుంది.
మహిళలకు మనోనిబ్బరం పెరుగుతుంది.
16,17 తేదీల్లో కుటుంబంలో ఒత్తిడులు.
లేనిపోని విమర్శలు. ఆరోగ్య సమస్యలు.