మీనం
స్వయంగా మీరు తీసుకున్న నిర్ణయాలు అందరి ప్రశంసలు పొందుతాయి.
ఆదాయం మరింత పెరుగుతుంది, అవసరాలకు లోటు ఉండదు.
కొన్ని వివాదాల నుంచి బయటపడతారు.
బంధువులతో మరింత సంతోషకరంగా గడుపుతారు.
ఆరోగ్యసమస్యలు సర్దుబాటు కాగలవు.
కాంట్రాక్టర్లకు కొత్త ఉత్సాహం,
దైవారాధనలో పాల్గొంటారు.
శత్రువులను దారికి తెచ్చుకుంటారు.
నిరుద్యోగులు, విద్యార్థుల ఆశయాలు నెరవేరే సమయం.
స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు.
వృత్తులు, వ్యాపారాలలో అనుకున్న ప్రగతిని సాధిస్తారు.
కళాకారులు, పరిశోధకులు, క్రీడాకారులకు అవకాశాలు లభిస్తాయి.
మహిళలు మనోబలంతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు.
15,16 తేదీల్లో దుబారా ఖర్చులు. కుటుంబంలో సమస్యలు.