మేషం
ఏ కార్యక్రమం చేపట్టినా ముందుకు సాగక నిరుత్సాపడతారు.
శ్రేయోభిలాషుల నుంచి ఆశించిన సహాయం అందదు.
ఆర్థికం కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది.
అవసరాలకు ఇబ్బందులు పడతారు.
బంధువర్గంతో విభేదాలు నెలకొని కొంత మనస్తాపం చెందుతారు.
ఆరోగ్య పరంగా చికాకులు ఎదురై విశ్రాంతి తీసుకుంటారు.
దూర ప్రయాణాలు సంభవం.
చిన్ననాటి స్నేహితులతో గతాన్ని ముచ్చటిస్తారు.
ఆస్తుల ఒప్పందాలు వాయిదా వేస్తారు.
మీ ఆలోచనలు ఎటూతేల్చుకోలేని విధంగా ఉంటాయి.
కొన్ని తీర్థయాత్రలు సైతం చేస్తారు.
వృత్తులు, వ్యాపారాలలో మరింత అప్రమత్తంగా మెలగాలి.
ఆశలకు పోయి ఇబ్బందులు తెచ్చుకోవద్దు.
రాజకీయవేత్తలు, సాంకేతిక నిపుణులు, క్రీడాకారులకు శ్రమ మాత్రమే మిగులుతుంది.
మహిళలకు సామాన్యమైన పరిస్థితులు ఉంటాయి.
14,15 తేదీల్లో శుభ వర్తమానాలు.
అదనపు ఆదాయం. కీలక నిర్ణయాలు.