సింహం
స్నేహితుల సలహాలు పాటిస్తూ ముందుకు సాగుతారు.
ఆలోచనలను కుటుంబ సభ్యులతో పంచుకుని వారి అభిప్రాయాలు తీసుకుంటారు.
కాంట్రాక్టర్లు టెండర్లు దక్కించుకుంటారు.
ఆధ్యాత్మిక చింతన పెరిగి ఆదిశగా అడుగులు వేస్తారు.
ఎంతో ఓర్పుతో వ్యవహారాలు చక్కదిద్దుతారు.
కొన్ని సమస్యలు, ఇబ్బందులు అధిగమించి ముందడుగు వేస్తారు.
ఆదాయం ఆశించిన మేర సమకూరి అవసరాలు తీరతాయి.
విశేష హోదాలు కలిగిన వారితో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి.
చిన్ననాటి విషయాలను మిత్రులతో పంచుకుంటారు.
ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి.
కార్యరంగంలోకి దిగితే మీకు ఎదురుండదు.
వృత్తులు, వ్యాపారాలలో విశేష ప్రగతి కనిపిస్తుంది.
పరిశోధకులు, రచయితలు, కళాకారులకు సన్మానాలు, పురస్కారాలు అందుతచాయి.
మహిళల మనోబలం పెరుగుతుంది.
12,13 తేదీల్లో మానసిక అశాంతి.
ఆప్తులతో మాటపట్టింపులు. దూర ప్రయాణాలు.