కుంభం
పనులు పూర్తి చేసి సత్తా నిరూపించుకుంటారు.
అందరినీ ఆదరించే మనస్తత్వం కలిగి ఉంటారు.
ప్రముఖ వ్యక్తులు అండగా నిలుస్తారు.
ఆదాయం మరింత పెరుగుతుంది,
బంధువులు మీ సలహాలు తీసుకుంటారు.
అందరితోనూ మీ అనుభవాలను పంచుకుంటారు.
వాహనాలు కొనుగోలు యత్నాలు కలసివస్తాయి.
సోదరులతో వివాదాలు సర్దుబాటు కాగల అవకాశం.
కొన్ని అవకాశాలు దక్కి విద్యార్థులు ఉత్సాహంగా గడుపుతారు.
వృత్తులు, వ్యాపారాలలో మీ ఆశయాలు సాధిస్తారు.
క్రీడాకారులు, కళాకారులు, రచయితలు మరింత గుర్తింపు పొందుతారు.
మహిళలు వివిధ సంఘాలలో సభ్యత్వాలు స్వీకరిస్తారు.
17,18 తేదీల్లో మానసిక ఆందోళన. కుటుంబంలో చికాకులు.